Donald Trump Effect : అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన ఎన్నికల హామీలు నెరవేర్చడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(Make America Great Again) నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను ఖైదీల్లా స్వదేశాలకు పంపుతున్నారు. జన్మతః సిటిజన్‌షిప్ రద్దు చేశారు. మరోవైపు కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలు(Taxes) విధించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతిపైనా భారీగా పన్ను విధించారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచదేశాలతోపాటు అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ దేశ ప్రజలు కూడా భయపడుతున్నారు. దీంతో వాషింగ్‌టన్ డీసీ(Washington Dc)లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం అవుతోంది. దీంతో వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు.
ఇళ్ల అమ్మకాలు..
అమెరికా రాజధాని వాషింగ్‌టన్ డీసీలో 14 రోజుల్లో 4,271 కన్నా ఎక్కువ ఇళ్లను అమ్మకానికి ఉంచారు. ఈవిషయాన్ని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎలుకలు పారిపోతున్నాయి. అని కాప్షన్ ఇచ్చాడు. నగరవాసులు తమ వసుత్వులు సర్దుకుని సామూహికంగా నగరం విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఈ వలసలకు కారణం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ అని స్థానికులు చెబుతున్నారు. నగరంలో, చుట్టుపక్కలక అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్‌చేశారు. నగరంలో 500లకుపైగా ఇళ్లు, రూ.8 కోట్లకన్నా ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయి వెల్లడించారు. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు తెలిపారు.
అమ్మకానికి ఉన్న ఇళ్లు..
ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ అయిన జిల్లోలో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాను మరో ఎక్క్ యూజర్ షేర్ చేశాడు. ఏడు రోజుల్లో 2–1, 14 రోజుల్ల 378, 30 రోజుల్లో 706, 90 రోజుల్లో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి వచ్చినట్లు వివరించాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఎక్స్‌లో పోస్టు చేశాడు. అక్రమ వలసదారులను తరలిస్తుండడంతో వారంతా అప్పటికే కొనుగోలు చేసిన ఇళ్లను అమ్మకానికి పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.