Homeఅంతర్జాతీయంHormuz Strait: హర్మూజ్‌ దాటి క్షేమంగ్రా వచ్చిన మరో నౌక.. ఈసారి 20 టన్నుల ఎల్‌పీజీ!

Hormuz Strait: హర్మూజ్‌ దాటి క్షేమంగ్రా వచ్చిన మరో నౌక.. ఈసారి 20 టన్నుల ఎల్‌పీజీ!

Hormuz Strait: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ దేశాల నుంచి రావాల్సిన నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో యూరప్‌ దేశాలతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జపాన్‌ దేశాలు చమురు కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. భారత్‌త నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇస్తోంది. కానీ అక్కడి ట్రాఫిక్‌ కారణంగా మన నౌకల రాక ఆలస్యం అవుతోంది. నౌకల విజయవంతమైన ప్రయాణాలు వరుసగా దేశీయ ఇంధన సరఫరాను నిల్వలు చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈనెల 13న జలసంధిని దాటిన మార్షల్‌ ఐలాండ్స్‌ జెండాతో ఉన్న సైమీ ట్యాంకర్‌ గుజరాత్‌ తీరానికి చేరుకుంది. 20 వేల టన్నుల ఎల్‌పీజీ తీసుకొచ్చింది. దీంతో హర్ముజ్‌ను సేఫ్‌గా దాటిన ఎల్‌పీజీ నౌకల సంఖ్య 11కు చేరింది.

దేశంలో ఎల్‌పీజీ కొరత..
భారతదేశానికి ఎల్‌పీజీ వంటి ఇంధన ఉత్పత్తుల విదేశీ దిగుమతులు కీలకమే. ప్రతీ ట్యాంకర్‌ దేశీయ మార్కెట్‌పై, గృహ వినియోగం, వాణిజ్య అవసరాలపై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. సైమీతో వచ్చిన సుమారు 20 వేల టన్నుల ఎల్‌పీజీ స్థానిక స్టోరేజ్, రీ–డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా వినియోగదారుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది.

అవాంతరాలను దాటుకుని..
హార్ముజ్‌ ప్రాంతం నుంచి సురక్షిత రవాణా కొనసాగించడం అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. వరుసగా 11 ట్యాంకర్ల సేఫ్‌ ఎక్స్‌హిట్‌లు ఉండటం సరఫరా చైన్లను నిలుపుకునేందుకు ఒక ప్రతీకాత్మక సంకేతం. అయినప్పటికీ, ప్రాంతీయ ఉత్కంఠలు కొనసాగితే రవాణా వ్యయం, బీమా సరఫరా ధరలు, మార్గాల ప్రత్యామ్నాయ ఏర్పాటుపై ప్రభావం పడవచ్చును.

ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం..
ప్రస్తుతం దేశంలో రోజుకు సుమారు 5 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు వినియోగం జరుగుతోందని అంచనాలు ఉన్న నేపథ్యంలో, సాధారణంగా ఇంధన మార్కెట్‌లో జరిగే చెల్లింపులు, ధరల స్థిరత్వానికి వర్తించే ప్రతి సరఫరా గొప్ప ప్రాధాన్యత కలిగినది.

సైమీ ట్యాంకర్‌ విజయవంతమైన రవాణా భారతానికి హార్ముజ్‌ వంటి సంకల్పప్రాంతాల నుంచి ఇంధన సరఫరా కొనసాగింపును సూచించే ఒక సానుకూల సంకేతం. అయితే ప్రాంతీయ అస్థిరతలు కొనసాగితే భవిష్యత్తులో మార్గాల భద్రత, రవాణా ఖర్చులు, వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వ రంగసంస్థలు మరింత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version