Site icon OkTelugu

Petrol Price Hike In India: దేశంలో ఇక పెట్రోల్ ధరలను భరించలేమా? ఏం జరుగుతోంది..

Petrol Price Hike In India

Petrol Price Hike In India

Petrol Price Hike In India: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల సెంబ్లీ ఎన్నికల కరాణంగా దాదాపు రెండు నెలలు ధరలు పెంచకుండా భవించిన కేంద్రం.. ఎన్నికలు ముగియగానే వరుసగా పెట్రో బాదుడు మొదలు పెట్టింది. గడిచిన పది రోజుల్లో మూడుసార్లు ధరలు పెంచి సామాన్యుడిపై తీవ్ర భారం మోపింది. క్రూడాయిల్‌ ఒత్తిడి, యిల్‌ కంపెనీల ఒత్తిడితో మే 15న పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.3 చొప్పున పెంచింది. మే 19న పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచింది. తాజాగా మే 23న మళ్లీ పెట్రోల్‌ లీటర్‌కు 87 పైసలు, డీజిల్‌కు 91 పైసలు, సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగాయి.

యుద్ధ ప్రభావమే అంటున్న కంపెనీలు..
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు దీర్ఘకాలం నష్టాలను భరించాయని చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అధిక ధరలకు క్రూడాయిల్‌ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడిందని వారి వాదన. కేంద్ర ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో ఎక్సైజ్‌ సుంకాన్ని తాత్కాలికంగా తగ్గించి, ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేక ధరలు పెంచుతోంది. హర్ముజ్‌ జలసంధి ఉద్రిక్తతలు – సరఫరా గొలుసు ముప్పుఅమెరికా–ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ జలసంధి ద్వారా ప్రపంచంలోని గణనీయమైన చమురు రవాణా జరుగుతుంది. దీని వల్ల నౌకా రవాణా ఖర్చులు పెరగడంతోపాటు సరఫరా తగ్గి, ధరలు ఎగిరిపోతున్నాయి.

పెప్పు ఇక్కడితో ఆగదు..
ప్రస్తుత పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని, మరిన్ని దశల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక, మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. కంపెనీలు ఇప్పటి వరకు చేసిన పెంపు సరిపోదని, ఇంకా కొన్ని వారాలు ఈ ప్రక్రియ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వినియోగదారులపై పడుతున్న భారం ఇంధన ధరల పెరుగుదల సరాసరి ప్రజల జీవన వ్యయాన్ని పెంచుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర రోజువారీ వస్తువుల ధరలు కూడా ఎగసేత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణ ఒత్తిడిలో ఉన్న మధ్యతరగతి కుటుంబాలపై ఇది అదనపు భారం. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలి. పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రోత్సాహం, విదేశీ చమురు ఆధారితత్వాన్ని తగ్గించే వ్యూహాలు త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడే చిన్న చిన్న మార్పులు కూడా భారతీయుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సవాల్‌ను అవకాశంగా మార్చుకుని, ఇంధన స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేయడం దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. లేని పక్షంలో, ఇలాంటి షాక్‌లు మరిన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

Exit mobile version