Ramesh Babu Son Jayakrishna: ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ…మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక కృష్ణ తర్వాత తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన తన సినిమాలతో ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట తను చేయబోయే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాడు అంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ పెద్ద కొడుకు అయిన రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన కూడా ఆయన సక్సెస్ అవ్వలేదు.
ఇక ఇప్పుడు అతని కొడుకు ‘జయకృష్ణ’ అజయ్ భూపతి డైరెక్షన్ లో ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఒక టీజర్ వచ్చింది. అందులో జయకృష్ణ చాలా చక్కటి పర్ఫామెన్స్ చూపించాడు. సినిమా ఎలా ఉండబోతుంది తను యాక్టర్ గా సెట్ అవుతాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా అయిన ‘ఒక్కడు’ మూవీని జయకృష్ణతో రీమేక్ చేయాలని కొంతమంది ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారట. దానికి మహేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి జయకృష్ణతో ఒక్కడు సినిమా చేస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను చేయాలి. అలా అయితే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు అభిమానులు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చిన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ గా చెబుతున్నారు. కాబట్టి జయకృష్ణకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకవేళ ఒక్కడు సినిమాని రీమేక్ చేసినట్లయితే మాత్రం జయకృష్ణ కెరియర్ టాప్ లెవెల్లో ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…