India Bangladesh Border: హమాస్ అనగానే ఉగ్రవాదం.. భూగర్భ సొరంగాలు గుర్తొస్తాయి. ఇక్కడ వారు అనేకా కార్యకలాపాలు సాగిస్తారు. బందీలను ఉంచుతారు. ఆయుధాలు దాస్తారు. ఇలాంటి సొరంగాలే ఇప్పుడు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కనిపిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మార్గాల ద్వారా బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు భారత్‌లోకి చొరబడుతున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం. సైన్యం భద్రతా చర్యలు పెంచినా, భూగర్భ మార్గాలు అక్రమ రాకపోకలకు సులభతరం చేస్తున్నాయి.
విచిత్రమైన సరిహద్దు..
భారత్ – బంగ్లాదేశ్ మధ్య పశ్చిమ బెంగాల్‌ల్‌లో సరిహద్దు విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో బహుశా చాలా తక్కువ దేశాల్లో ఇలాంటి సరిహద్దు ఉంటుంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు రోడ్లు, ఇళ్లు, రైలు పట్టాలాల మధ్య విభజించబడి ఉంది. ఇటువంటి ప్రదేశాల్లో సొరంగాలు తవ్వడం సులభం. బీఎస్‌ఎఫ్ ఇటీవల ఇద్దరు స్మగ్లర్లను కాల్చి పడగొట్టినా, భూమిలోపలి నెట్‌వర్క్ పెరుగుతోంది. ఈ సొరంగాలు మారాణాయుధాలు, బందీల కోసం కాకుండా అక్రమ వలసలకు ఉపయోగపడుతున్నాయి.
భద్రతా చర్యలు..
నిఘా వర్గాలు సర్వేలు చేపట్టి అనేక సొరంగాలను సీజ్ చేశాయి. బీఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు టెక్నాలజీతో కలిపి పర్యవేక్షణ పెంచారు. బంగ్లాదేశ్ వైపు కూడా ఇలాంటి కార్యకలాపాలు పెరుగుతున్నాయని సమాచారం. ఈ ముప్పును అరికట్టేందుకు రెండు దేశాల మధ్య సహకారం అవసరం. అక్రమ చొరబాటు భారత వనరులపై ఒత్తిడి పెంచుతోంది. ఉపాధి కోసం మాత్రమే కాకుండా, కొందరు అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో వస్తున్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థ, సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు సవాలుగా మారనుంది.
సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌లు, గ్రౌండ్ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పర్యవేక్షణ పెంచాలి. స్థానికుల సహకారం, రెండు దేశాల మధ్య డైలాగ్ ద్వారా మూలాలను నియంత్రించవచ్చు. ఈ చర్యలు అక్రమ చొరబాటును పూర్తిగా అరికట్టగలవు.