https://oktelugu.com/

Phones Hacked : అమెరికా అధ్యక్ష అభ్యర్థుల ఫోన్లు హ్యాక్‌.. డేటాను టార్గెట్‌ చేసిన హ్యాకర్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. హామీలు, వరాలు కురిపిస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 26, 2024 / 02:34 PM IST

    Phones Hacked

    Follow us on

    Phones Hacked :  అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరుగనున్నాయి. ఈమేరకు అగ్రరాజ్యంలో ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. గడువు పది రోజులే ఉండడంతో అభ్యర్థులు తుది విడత ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హామీలు కురిపిస్తున్నారు. వరాల వర్షంతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కాబోయే అధ్యక్షులు ఎవరే విషయం ముదే తేల్చేందుకు సర్వే సంస్థలు అంచనాల్లో నిమగ్నమయ్యాయి. ఓటరు నాడి పట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా ఎవరి పనిలో వారు ఉండగా.. హ్యాకర్లు తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ డాటా సేకరణే లక్ష్యంగా పంజా విసిరారు. వీరి ఫోన్‌ కమ్యూనికేషన్లను లక్ష్యంగా చేసుకుని డ్రాగన్‌ సైబర్‌ ముఠా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

    న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం..
    రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, ఆయన ర్నింగ్‌మేట్‌ జేడీ.వాన్స్‌ ఉపయోగిస్తున్న ఫోన్ల నుంచి చైనా హ్యాకర్లు డేటా తస్కరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం వెల్లడించింది. వీరితోపాటు డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్‌మేట్‌ టిమ్‌ వాజ్‌ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. వెరిజోన్‌ ఫోన్‌ సిస్టమ్స్‌కి చొరబడి హ్యాకర్లు సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు యత్నిస్తున్నట్లు ఈ కథనంలో పేర్కొంది. ఇంటెలిజెన్స్‌ సమాచారం సేకరిస్తున్నట్లు అమెరికా టెలీకమ్యూనికేషన్స్‌ ప్రొవైడర్లను విదేశీ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసిందని వెల్లడించింది. దీనిపై దర్యాప్తు అదికారులు దృష్టిపెట్టాలని సూచించింది.

    చైనా మద్దతులోనే..
    ఈ హ్యాకింగ్‌ చైనా ప్రభుత్వ మద్దతులోనే జరిగినట్లు భావిస్తున్నారు. చైనా మద్దతు ఉన్న ముఠా సాల్ట్‌ టైపూన్‌ ఈ హ్యాకింగ్‌కు పాల్పడి ఉంటుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్, వాన్స్‌ ఫోన్‌ నంబర్లతోపాటు వీరి ప్రచార బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బంది ఈ ఫోన్‌ డేటాను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వాషింగ్‌టన్‌ పోస్టు తెలిపింది. అటు డెమొక్రటిక్‌ ప్రభుత్వంలోని కొందరు అధికారుల ఫోన్‌ కమ్యూనికేషన్లను కూడా ట్రాప్‌ చేసినట్లు తెలిసింది. ఈ కథనాలపై ఎల్‌బీఐ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సంయుక్తంగా ప్రకటన విడుదల చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ప్రచారం వివరాలతోపాటు కేసుల వంటి సున్నితమైన అంశాలపైనా హ్యాకర్లు దృష్టిపెట్టినట్లు తెలిసిందని వెల్లడించారు.