America Gun Culture: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మరో నెల రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా గెలవాలని హామీలు కురిపిస్తున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో అధ్యక్ష రేసులో ఎవరు ముందు ఉన్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ పోటీలో ఉన్నప్పుడు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కాస్త దూకుడు ప్రదర్శించారు. బైడెన్‌కన్నా ముందంజలో ఉన్నారు. అయితే ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో కాల్పుల తర్వాత ట్రంప్ ఇమేజ్ మరింత పెరిగింది. సానుభూతి ఓటర్లు ఆయనవైపు మొగ్గు చూపారు. దీంతో బైడెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులోకి వచ్చారు. కమలా వచ్చాక పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ తరుణంలో ట్రంప్‌పై మరోమారు కాల్పులు జరిగాయి. కమలా హారిస్ కార్యాలయంపైగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో గన్ కల్చర్‌కు చెక్ పెట్టేలా అధ్యక్షుడు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తుపాకీ హింసకు స్వస్తి పలకాలని కొత్త చట్టంపై సంతకాలు చేశారు.
ఎక్స్ వేదికగా పోస్టు..
తాజాగా కొత్త చట్టంపై బైడెన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతిచెందుతున్న చిన్నారులకన్నా.. తుపాకీ కారణంగానే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనది. ఈ హింసను అంతం చేయాలని నేను, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కృషి చేస్తున్నాం. మీరూ మాతో చేతులు కలపండి. తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తాను సంతకాలు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఈ ఆర్డర్ ప్రకారం… మొదట మెషీన్‌గన్ మార్పిడి పరికరాలతో సహా ఉత్ప ్నమయ్యే తుపాకీ బెదిరింపులపై ప్రభుత్వం దృష్టి పెటుడుతంది. ఇది హ్యాండ్ గన్ లేదా పిస్టల్ ఆటోమేటిక్ తుపాకీ లేదా ఆయుధంగా మారుస్తుంది. ఇటువంటి పరికరాలను ఇప్పటికే చట్టవిరుద్ధం. అయితే చట్టం అమలు సంస్థలు అటువంటి ఆయుధాలు విచక్షణా రహితంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుందని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికాలో తుపాకీదే హవా..
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ హింస తీవ్రంగా ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో కాల్పులు పెరుగుతుఆన్నయి. రెండు దశాబ్దాలుగా పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో వందల సంఖ్యలో కాల్పులు జరిగాయి. ఈ హింసలు యూఎస్ తుపాకీ చట్టాలు, రాజ్యాంగం రెండో సవరణపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చట్టం ప్రయారం ఆయుధాలు కలిగి ఉండే హక్కు అందరికీ ఉంది. విద్యాసంస్థల్లో కాల్పుల కారణంగా 2020లో 4,368 మంది పిల్లలు మృతిచెందారు. ఇక 2019లో ఆ సంఖ్య 3,390గా ఉంది. 2021లో 4,752కు చేరింది. ఇక 2007లో వర్జీనియా టెక్‌లో జరిపిన కాల్పుల్లో 30 మందికిపైగా మరణించారు.