Homeఅంతర్జాతీయంAmerica: ప్రపంచానికి పెద్దన్ననని గొప్పలు పోతుంది గాని.. అమెరికాలో రాజకీయ హింస ఈనాటిది కాదు

America: ప్రపంచానికి పెద్దన్ననని గొప్పలు పోతుంది గాని.. అమెరికాలో రాజకీయ హింస ఈనాటిది కాదు

America: ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికాలో రాజకీయ హింస ఈనాటిది కాదు అబ్రహం లింకన్, జేమ్స్ గారీ ఫీల్డ్, విలియం మెకిన్లీ, జాన్ ఎఫ్ కెన్నడీ హత్యలు అమెరికాలో అప్పట్లో కలకలం సృష్టించాయి. నాటి నుంచి అమెరికాలో అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ భద్రతను మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షించేందుకు సీక్రెట్ ఏజెన్సీ కూడా నియమించారు. అయితే నాటి నుంచి నేటి వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అమెరికా అధ్యక్షుల భద్రతను రెట్టింపు చేసింది. అయినప్పటికీ దాడులు జరగకుండా ఉండలేదు. గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 18 రోజుల వ్యవధిలో అతనిపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. 1981లో అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రీగన్ ఓ ముష్కరుడు జరిపిన కాల్పుల వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఆధునిక కాలంలో ప్రతి అమెరికన్ అధ్యక్షుడిని ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆ ప్రయత్నాలను సీక్రెట్ సర్వీస్ సమర్థవంతంగా అడ్డుకుంది.

2016లో చంపేందుకు ప్రయత్నం

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో భాగంగా లాస్ వేగాస్ లో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఓయ్ ఇంగ్లాండ్ వ్యక్తి ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు ట్రంప్ ను చంపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు.

రోనాల్డ్ రీగన్

1981 మార్చి 30న అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పై జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి ఆరు షాట్లు కాల్చాడు. మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. ఆ కాల్పుల్లో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనేక శస్త్ర చికిత్సల తర్వాత కోలుకున్నాడు. ఆ ముగ్గురు బాధితులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. 2016 వరకు అతడిని మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచారు. ఈ కాల్పులు జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీగన్ కన్నుమూశాడు.

గెరాల్డ్ ఫోర్డ్

1975 సెప్టెంబర్ ఐదున అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంక్రమెంటో ప్రాంతంలో గెరాల్డ్ ఫోర్డ్ ను చార్లెస్ మాన్సన్ లినెట్ స్క్వీకి అనే వ్యక్తి చంపేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగిన మూడు వారాల తర్వాత సారా జెన్, మూర్ శాన్ మన ఇద్దర మహిళలు ఫ్రాన్సిస్కో నగరంలో ఫోర్డ్ పై కాల్పులు జరిపారు. అమెరికా చరిత్రలో ఇద్దరు మహిళలు ఒక అధ్యక్షుడిని చంపేందుకు ప్రయత్నించడం అప్పట్లో కలకలం సృష్టించింది.

జాన్ ఎఫ్ కెన్నెడీ

అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ని నవంబర్ 22 1963 లో టెక్సాస్ లో సిర్హాని అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఈ ఘటనకు కారణమైన సిర్హాని ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. ఇక ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో జాన్ ఎఫ్ కెన్నడి కుమారుడు రాబర్ట్ ఎఫ్ కెన్నడి జూనియర్ పోటీ చేస్తున్నాడు.

రుజు వెల్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు రుజు వెల్ట్ 1912 అక్టోబర్ 14న మిల్వా కీ ప్రాంతంలో జాన్ శ్రాంక్ అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో రుజు వెల్ట్ ఉడ్రోవిల్సన్ చేతిలో ఓడిపోయాడు.

విలియం మెకెన్లీ

1901 సెప్టెంబర్ 6న న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో మెకిన్లీ ని లియోన్ క్జోల్గో స్ట్ అనే దుండగుడు కాల్చి చంపాడు. విలియం కన్నుమూసిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రుజు వెల్ట్ ను అధ్యక్షుడిగా నియమించారు.

జేమ్స్ గారీ ఫీల్డ్

1881 జూలై రెండున అమెరికా అధ్యక్షుడు జేమ్స్ గారి ఫీల్డ్ వాషింగ్టన్ లో చార్లెస్ గిటో అనే దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. రెండు నెలలపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆ తర్వాత నిందితుడికి స్థానిక కోర్టు మరణ శిక్ష విధించింది.

అబ్రహం లింకన్

1865 ఏప్రిల్ 14న అబ్రహం లింకన్ ను వాషింగ్టన్ లో సుప్రసిద్ధ నటుడు, కాన్ఫడరేట్ సానుభూతిపరుడు జాన్ విల్కేస్ కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. పోలీసులు రెండు వారాలపాటు గాలింపు చేపడితే.. అతడి ఆచూకీ లభ్యమైనది. ఆ తర్వాత అతడిని పోలీసులు కాల్చి చంపారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version