Donald Trump Attack: డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులకు పక్కా స్కెచ్.. నిందితుడి ప్రణాళిక మామూలుగా లేదు.. సీక్రెట్ ఏజెన్సీ కి ఫ్యూజ్ లు ఔట్

శనివారం సాయంత్రం 6 గంటల రెండు నిమిషాలకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వేదిక పైకి వచ్చాడు. భారీగా కార్యకర్తలు రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందర్భంగా మారింది. ఈ క్రమంలో god bless the USA అనే పాటను ప్లే చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించడం మొదలుపెట్టాడు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తూర్పారబట్టాడు. "సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు పెరిగాయి. బైడెన్ కాలంలో అమెరికా సర్వనాశనమైంది. నిరుద్యోగం తారస్థాయికి చేరింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 14, 2024 11:56 am

Donald Trump Attack

Follow us on

Donald Trump Attack: మరి కొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తుండగా.. ఓ దుండగుడు ఆయనను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. అతడిని భద్రతా దళాలు వెంటనే ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా కలకలం నెలకొంది.

శనివారం సాయంత్రం 6 గంటల రెండు నిమిషాలకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ర్యాలీలో ఎన్నికల ప్రచారం చేసేందుకు వేదిక పైకి వచ్చాడు. భారీగా కార్యకర్తలు రావడంతో ఆ ప్రాంతం మొత్తం సందర్భంగా మారింది. ఈ క్రమంలో god bless the USA అనే పాటను ప్లే చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగించడం మొదలుపెట్టాడు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తూర్పారబట్టాడు. “సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు పెరిగాయి. బైడెన్ కాలంలో అమెరికా సర్వనాశనమైంది. నిరుద్యోగం తారస్థాయికి చేరింది. ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అమెరికా చరిష్మా మొత్తం పడిపోయింది. ఇలా అయితే అమెరికా ప్రపంచం మీద పెత్తనం సాగించలేదని” ట్రంప్ దుయ్యబట్టాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడం మొదలుపెట్టాడు. అప్పటికే ఐదు షాట్లు వినిపించాయి. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రంగంలోకి దిగి.. ట్రంప్ వైపు దూసుకొచ్చారు. “దిగిపో.. వంగిపో” అంటూ ట్రంప్ కు ఆదేశాలిచ్చి.. చుట్టుముట్టారు. అప్పటికే బుల్లెట్ గాయం ట్రంప్ చెవిని తాకడంతో రక్తం కారడం మొదలుపెట్టింది. భద్రతా దళాలు ఆయనకు గాయమైన చెవిని పట్టుకొని వేదిక నుంచి కిందికి దించారు.. మరలా వేదిక పైకి తీసుకువెళ్లేందుకు భద్రత దళాలు ప్రయత్నించగా ట్రంప్ వారించారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లే క్రమంలో ట్రంప్ తన పిడికిలి బిగించి “పోరాటం” అంటూ నినాదాలు చేశారు.

ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు వేదికకు 130 గజాల దూరంలో నిందితుడు ఉన్నాడు. అతడు ఓ తయారీ కేంద్రం పై కప్పు పై అత్యంత చాకచక్యంగా నిలిచిని ఉన్నాడు. ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీ బట్లర్ ఫార్మ్ షో గ్రౌండ్స్ లో ఓపెన్ ఎయిర్ సెట్టింగ్ లో జరిగింది.. ఇది విశాలమైన ఓపెన్ ఫీల్డ్ అని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది..ఆ భవనం పైకప్పు పై నిల్చుని ఆ నిందితుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ప్రేక్షకుల స్టాండ్ అడ్డుగా ఉండడంతో అతడు భద్రతా దళాలకు కనిపించలేదు. ట్రంప్ పై కాల్పులు జరిపిన అనంతరం.. ఆ నిందితుడి పై భద్రతా దళాలు ఫైరింగ్ చేశాయి. ఆ సమయంలో అతడి మృతదేహాన్ని AJR international INC complex భవనంపై కనుగొన్నారు. ఆ భవనంలో గాజు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పరిశ్రమకు సంబంధించిన ఆటోమేషన్ పరికరాలను రూపొందిస్తున్నారు.

నిందితుడిని కాల్చి చంపిన తర్వాత భద్రత దళాలు అతని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అతడి జేబులో ఉన్న గుర్తింపు కార్డులను సేకరించి, తదుపరి విచారణ నిమిత్తం భద్రపరిచాయి. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు కాల్పులు జరిపాడు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తికి మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. అందువల్లే అతడు ట్రంప్ పై కాల్పులు జరిపాడని..ఐదు షాట్లు విచక్షణారహితంగా కాల్చాడని స్థానికులు అంటున్నారు.