Vijaysai Reddy: విజయసాయిరెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇటీవల ఆయన ఎందుకు కనిపించడం లేదు? జగన్ పక్కన పెట్టారా? ఆయనే జగన్ కు దూరమయ్యారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉండేవారు. జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించేవారు. అంతకుముందే జగన్ తో పాటు జైలు జీవితం అనుభవించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏటుగా ఉన్నారు. వైసిపి ఆవిర్భవించిన తర్వాత కూడా పార్టీలో నంబర్ 2 గా కొనసాగారు. ఇప్పుడు పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆయన కనిపించకుండా పోయారు. వైసీపీలో సైతం ఇదే చర్చ నడుస్తోంది. తాజాగా ఆయనపై ఓ అధికారిని భర్త ఫిర్యాదు చేయడం సంచలనం గా మారుతోంది.
విజయసాయి రెడ్డి పై చాలా రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో విశాఖలో భారీగా భూములు పోగేసుకున్నారు అన్నది ఆయనపై ఉన్న ఆరోపణ.ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని, చాలామంది వద్ద బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ నగర పరిధిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ప్రతి శుక్రవారం విజయసాయిరెడ్డి కుటుంబం కోసమే పనిచేసాయి అన్న విమర్శలు కూడా వినిపించాయి.సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో జగన్ స్పందించారు. ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు.పార్టీ సోషల్ మీడియా విభాగం నుంచి కూడా తొలగించారు.దీంతో విజయసాయిరెడ్డి కొన్ని నెలల పాటు సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన పార్టీని వీడుతారని కూడా ప్రచారం జరిగింది.
వైసీపీలో ఆ నలుగురికి పెద్దపీట అన్న ఆరోపణ ఉంది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు హవా చలాయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక విధంగా ఓటమికి కూడా వారే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.అయితే ఇప్పుడు మిగతావారు పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తున్నా విజయసాయి రెడ్డి జాడ లేకపోవడం విశేషం. ఆయన బిజెపిలో చేరిపోతారని టాక్ నడుస్తోంది. ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కనీసం సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు. మొన్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి దారుణంగా ఓడిపోయారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. కౌంటింగ్ కు ముందు నుంచే నెల్లూరులో కనబడకుండా పోయారు. కనీసం వైసిపి ఓటమి సమీక్షలో కూడా విజయసాయిరెడ్డి కనిపించలేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా?లేరా? అన్న కొత్త చర్చ ప్రారంభమైంది.
తాజాగా విజయసాయి రెడ్డి పై ఓ వివాదాస్పద ఫిర్యాదు దేవాదాయ శాఖకు వెళ్ళింది. దేవాదాయ శాఖలో ఓ మహిళ కీలక అధికారిగా ఉన్నారు. ఆమె విజయసాయిరెడ్డి సిఫారసులు మేరకు ఉద్యోగ స్థానాన్ని పొందారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన పెట్టిన పోస్టులకు సదరు మహిళా అధికారి కామెంట్లు పెట్టేవారు. అనుకూల కామెంట్స్ చేసేవారు. అయితే తాజాగా ఆ అధికారిణి భర్త దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.తాను విదేశాల్లో ఉండగా.. తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని ప్రస్తావించారు.తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని ఆయన కోరుతూ ఫిర్యాదు చేశారు. పరోక్షంగా విజయసాయి రెడ్డి పై అనుమానం వ్యక్తం చేశారు.ఈ వయసులో వచ్చిన ఆ అపవాదును విజయసాయిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే బయటకు కనిపించడం లేదని కూడా తెలుస్తోంది. కేసులతో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటాడుతున్న తరుణంలో.. ఈ కేసు కానీ సీరియస్ గా తీసుకుంటే విజయసాయిరెడ్డి పరువు పోవడం ఖాయం. అందుకే ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. బిజెపి పెద్దలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.