Cow Dung
Cow Dung : ఆవు పేడను (Cow Dung) ఒక్కోక్కరు ఒక్కో దానికి ఉపయోగిస్తారు. వాకిట్లో కల్లాపు చల్లడానికి, మరికొందరు పిడకలు చేసి వంటకు, ఇంకొందరు ఎరువుగా ఉపయోగిస్తుంటారు. ఆవు పేడలో (Cow Dung) ఎన్నో బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి ఉందని పూర్వం ఎక్కువగా కల్లాపు చల్లేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఆవు పేడను కనీసం టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఇదేదో ప్రాణం తీసేది ఏమోనని కనీసం దాని వంక కూడా చూడకుండా అసహ్యించుకుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పేడ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఆవును (Cow) పవిత్రంగా భావించి పెంచుకుంటారు. ఇది గ్రామాల్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే మన దేశంలో కంటే గల్ఫ్ దేశాల్లో పేడకు మంచి డిమాండ్ ఉంది. మన దేశం నుంచి ఆ దేశాలకు భారీ మొత్తంలో ఆవు పేడను గల్ఫ్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇండియాలో ఆవు పేడకు అంత డిమాండ్ లేదు. నిజానికి ఫ్రీగా లభ్యమవుతుంది. చాలా మంది దీన్ని పిడకలు లేదా ఎరువుగా చేస్తారు. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం ఆవు పేడను ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. దీనివల్ల ఆ దేశాలకు భారీ లాభం చేకూరడంతో భారీగా ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే మన దేశంలో ఉపయోగపడని ఆవు పేడ అసలు ఆ దేశంలో ఎలా ఉపయోగపడుతుంది? ఆర్థిక వ్యవస్థకు ఇది ఎలా మెరుగుపరుస్తుంది? ఆవు పేడతో వారు ఏం చేస్తున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఖర్జూరం పండుతుంది. మన ఇండియాకి కూడా ఇక్కడి నుంచే వస్తుంది. అయితే గల్ఫ్ దేశాలు మన దేశంలో దొరికే ఆవు పేడను దిగుమతి చేసుకుని వీటిని బాగా ఎండబెడతారు. ఆ తర్వాత పల్వరైజ్ చేసి ఆ పేడను ఎరువుగా ఖర్జూరం చెట్లకు వేస్తారు. దీనిపై అన్ని పరిశోధనలు చేసిన తర్వాతే ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నారు. ఆవు పేడ వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ ఎరువు వల్ల ఖర్జూరం పండ్ల పరిమాణం పెరుగుతుంది. సాధారణ దిగుబడి కంటే ఎక్కువగా వస్తుందని పేడను దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల వారికి ఆశించిన కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. భారత దేశంలో రోజుకి సుమారుగా 300 మిలియన్ల పశువులు పేడను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ద్వారా దాదాపుగా 30 మిలియన్ టన్నుల పేడ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఎండబెట్టి వివిధ దేశాలకు దిగుమతి చేస్తోంది. అయితే మరికొన్ని దేశాలు ఆవు పేడను ఇంధనం తయారు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. దీంతో ఆవులను కూడా మరింత పెంచాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆవు పేడ కిలో రూ.30 నుంచి రూ.50లకు పలుకుతోంది. భవిష్యత్తులో దీని ధర ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దేశంలో పశువులను కూడా పెంచడానికి ట్రై చేస్తున్నారు.