Planet Parade
Planet Parade : ప్రస్తుతం ఆకాశంలో అద్భుతం కనువిందు చేస్తోంది. జనవరి 21వ తేదీ నుంచి ఆకాశంలో ప్లానెట్ పరేడ్ 2025 కనువిందు చేస్తోంది. ప్లానెట్ పరేడ్ (Planet Parade) అంటే ఆకాశంలో ఆరు గ్రహాలు అద్భుతమైన ప్రదర్శన చేస్తాయి. వీనస్, మార్స్, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు అద్భుతమైన ప్రదర్శన చేస్తాయి. ఈ గ్రహాల అమరికను ఈజీగా ఆకాశంలో (Sky) చూడవచ్చు. వీటిలో కొన్ని గ్రహాలు కనిపంచకపోయినా కూడా బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌తో చూడవచ్చు. అయితే ఈ ప్లానెట్ పరేడ్ (Planet Parade) రేపటితో పూర్తవుతుంది. అయితే ఈ గ్రహాల లిస్ట్‌లో మెర్క్యూరీ కూడా చేరనుంది. ఫిబ్రవరి 28వ తేదీన చేరి.. మార్చి 12వ తేదీ వరకు ఇవి ఆకాశంలో అద్భుతాన్ని చూపిస్తాయి. దీనికోసం గురుగ్రామ్, ముంబై, డెహ్రాడూన్‌లో సెషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆకాశంలో క్లియర్‌గా ఈ గ్రహాలు అన్ని కూడా కనిపిస్తాయి. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా.. ఆరు గ్రహాల్లో నాలుగు గ్రహాలు కళ్లకు స్పష్టంగా కనిపించడమే దీని ప్రత్యేకత. అందుకే దీన్ని ప్లానెట్ పరేడ్ అని అంటారు. ఇది తరచుగా జరిగే ప్రక్రియ. గ్రహాలు వరుసగా ఉండటంతో ఈ ప్లానెట్ పరేడ్ జరుగుతోంది.
ఈ ప్లానెట్ పరేడ్‌ను వీక్షించడానికి సాయంత్రం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. సూర్యాస్తమయం అయిన గంట తర్వాత చూడాలి. అయితే వీటిని డైరెక్ట్‌గా కాకపోయినా కూడా స్మార్ట్ ఫోన్‌లో కూడా చూడవచ్చు. కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా కనిపిస్తుంది. అయితే బైనాక్యులర్స్ తో చూస్తే జూపిటర్‌తో పాటు దాని చంద్రుడు కూడా క్లియర్‌గా కనిపిస్తారు. అదే టెలిస్కోప్ అయితే యురేనస్, నెప్ట్యూన్ కూడా చూడవచ్చు. వీటితోనే కాకుండా కొన్ని యాప్‌ల ద్వారా కూడా వీటిని వీక్షించవచ్చు. స్టార్ వాక్, స్టార్ ట్రాకర్, స్కై మ్యాప్‌ల ద్వారా వీటిని చూడవచ్చు. రేపటితో ఈ ప్లానెట్ పరేడ్ పూర్తి అవుతుంది. దీంతో ఇది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వీటిని వీక్షించడానికి ఇప్పటికే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నో టెలిఫోన్ సెషన్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లానెట్ పరేడ్ అబుదాబిలో జనవరి 18వ తేదీన స్పష్టంగా కనిపించింది. అలాగే జనవరి 18న హాంకాంగ్‌లో, జనవరి 21న టోక్యోలో, జనవరి 22న న్యూయార్క్‌లో, జనవరి 23న ఏథెన్స్‌లో బాగా కనిపించింది.