Sundar Pichai: ఐటీతోపాటు, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కరోనా తర్వాత మొదలైంది. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను ఇళ్లకు పంపించాయి. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. గతేడాది భారీగా ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. ఈ ఏడాది కూడా పదుల సం్యలో ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో లేఆఫ్‌లపై ఉదోఓయగుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గూగుల్ ఉద్యోగులు నేరుగా సీఈవో సుందర్ పిచాయ్‌నే దీనిపై ప్రశ్నించారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్‌లో పిచాయ్‌కు ఈ ప్రశ్న ఎదురైంది.
సుందర్ ఏం చెప్పారంటే..
ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో లేఆఫ్‌ల గురించి ఓ ఉద్యోగి మాట్లాడారు. ఇంకా ఎన్నాళ్లు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రశ్నించారు. దీనిపై పిచాయ్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలలపాటు లేఆఫ్‌లు కొనసాగుతాయని చెప్పారు. రెండో అర్ధభాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
నియామకాల గురించి ఇలా..
ఇక ఉద్యోగ నియామకాల గురించి ఈ సందర్భంగా పిచాయ్ స్పందించారు. కొత్త నియామకాల విషయంలో గూగుల్ క్రమశిక్షణతో వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవం కన్నా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్లు వివరించారు.
మరికొన్ని ప్రశ్నలు..
ఇక ఈ సమావేశంలో పిచాయ్‌కు మరికొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. త్రైమాసిక ఆదాయాల్లో ఊహించిన దానికన్నా అధికంగానే కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నా కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. వేతనాల పెంపు చేపట్టడం లేదంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నించారు. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, ఉద్యోగులు, యాజమాన్యానికి మధ్య అంతరం పెరుగతోందని మరో ఉద్యోగి సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సుందర్ మాట్లాడుతూ మంచి ఫలితాలు ఒక్కటే కంపెనీ విజయాన్ని సూచించవన్నారు. గూగుల్ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.