దేశ ప్రజలకు శుభవార్త… ఆ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

దేశంలో ప్రస్తుతం కరోనా గురించి తప్ప దేని గురించి చర్చ జరగట్లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రజలను కరోనా భయం వీడటం లేదు. ఐటీ ఉద్యోగులు సంస్థలకు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని తెగేసి చెబుతున్నారు. బయటకు వెళితే వైరస్ ఎక్కడ సోకుతుందో అని పూర్తిగా ఇంటికే పరిమితమైన వాళ్లు కూడా ఉన్నారు. Also Read : వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే.. కరోనా […]

Written By: Navya, Updated On : September 25, 2020 1:54 pm
Follow us on

దేశంలో ప్రస్తుతం కరోనా గురించి తప్ప దేని గురించి చర్చ జరగట్లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడినా ప్రజలను కరోనా భయం వీడటం లేదు. ఐటీ ఉద్యోగులు సంస్థలకు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని తెగేసి చెబుతున్నారు. బయటకు వెళితే వైరస్ ఎక్కడ సోకుతుందో అని పూర్తిగా ఇంటికే పరిమితమైన వాళ్లు కూడా ఉన్నారు.

Also Read : వైఫై వాడుతున్నారా.? డేంజర్ లో ఉన్నట్టే..

కరోనా వైరస్ కు ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా మరికొన్ని నెలల్లో ఇతర వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కరోనాకు ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా శాస్త్రవేత్తలు డెంగ్యూ వ్యాధి విషయంలో ఆశాజనకమైన ఫలితాలను సాధించారు. పనాసియా బయోటెక్ అనే సంస్థ డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో ఆశాజనకమైన ఫలితాలను సాధించినట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించిన ఈ సంస్థ ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయని తెలుపుతోంది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా త్వరగా కంపెనీ ఫలితాలను విశ్లేషించాలని సంస్థ కోరుతోంది. 4 రకాల డెంగీ వైరస్‌ సెరోటైప్‌లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని సంస్థ చెబుతోంది. ఒక్క డోసు వ్యాక్సిన్ తోనే డెంగ్యూ రాకుండా అడ్డుకోవచ్చని సంస్థ వెల్లడిస్తోంది.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని శరీరంలో వైరస్ కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొంది. దేశంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ బారిన పడ్డ వారిలో ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో డెంగ్యూ కేసులు నమోదు కావని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read : జంక్ ఫుడ్ తినే మహిళలకు షాకింగ్ న్యూస్..?

Tags