European Union Economic Crisis: “ఆడి” పుట్టిన దేశం… ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతోంది

యూరోపియన్ యూనియన్ లో జర్మనీ దేశానిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ దేశానికి పేరు ఉంది. విలాసవంతమైన కార్లను ఉత్పత్తి చేసే ప్రాంతంగా జర్మనీ పేరిట తిరుగులేని రికార్డులు ఉన్నాయి.

Written By: Rocky, Updated On : May 26, 2023 9:15 am

European Union Economic Crisis

Follow us on

European Union Economic Crisis: ” మేము ప్రపంచానికి సంస్కృతిని పరిచయం చేశాం. మా నుంచి ప్రపంచ దేశాలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్తంభాలు చాలా బలంగా ఉన్నాయి. మేము చేసే ప్రతి పని కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ అంటే ఒక ప్రబల శక్తి” రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగేముందు యూరోపియన్ యూనియన్ అన్న మాటలు అవి. కానీ తరచి చూస్తే అవేమీ శుద్ధ పూసలు కావని, వాటి కింద కూడా తారు రంగుకు మించిన నలుపు మరకలు ఉన్నాయని బయట ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పేరుకు దృఢమైన ఆర్థిక స్తంభాలు ఉన్నాయని యూరోపియన్ యూనియన్ చెపుతుంది కానీ.. అంత సీన్ లేదని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేసిందో… అప్పుడు బాధిత ఉక్రెయిన్ కు సంఘీభావంగా నిలవాల్సిన యూరోపియన్ యూనియన్ సైలెంట్ గా పక్కకు జరిగింది. యూరోపియన్ యూనియన్ నాయకులు చెప్పిన మాటలతో ఎగిరి ఎగిరి పడిన ఉక్రెయిన్ ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తోంది. అయితే ఇప్పుడు ఆ దేశం ఉసురు జర్మనీని గట్టిగా తగిలినట్టుంది. అందుకే ఆడి పుట్టిన దేశం డబ్బులు లేక అల్లాడిపోతోంది.

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ

యూరోపియన్ యూనియన్ లో జర్మనీ దేశానిది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే ఆటోమొబైల్ రాజధానిగా జర్మనీ దేశానికి పేరు ఉంది. విలాసవంతమైన కార్లను ఉత్పత్తి చేసే ప్రాంతంగా జర్మనీ పేరిట తిరుగులేని రికార్డులు ఉన్నాయి. అలాంటి ఆ దేశం ఇప్పుడు ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి వరకు స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్టు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు చెబుతున్నాయి. 2022 చివరి త్రేమాస్కం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య దేశ జిడిపి 0.5 శాతం క్షీణించింది. ఇక వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి లేకపోతే, లేకుంటే క్షీణత నమోదైతే దానిని ఆ దేశం ఆర్థిక మాంద్యంలోకి జారినట్టు పరిగణిస్తారు.

అధిక ధరలు జర్మనీ దేశం లోని వినియోగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ధరల స్థాయి కూడా నిరంతరం పెరగడంతో దేశంలో ఆనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మాసంలో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని వారు చెబుతున్నారు. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ధరల స్థాయి పెరగడం వల్ల వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు. ముఖ్యంగా నిత్యవసరాలు తప్ప ఇతర లగ్జరీ వస్తువుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనికి తోడు ఆ ప్రాంతానికి సరఫరా చేసే గ్యాస్ విషయంలో రష్యా ఆంక్షలు విధించడంతో ఆ దేశం పరిస్థితి పూర్తిగా తారు మారయింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో గ్యాస్ ఆధారంగానే ఎక్కువ కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి గ్యాస్ అత్యంత కీలకం. కానీ దాని సరఫరా విషయంలో రష్యా ఆంక్షలు విధించడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు కోలుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం జర్మనీ ఆర్థిక మాంధ్యంలోకి జారిపోగా.. అదే జాబితాలో మిగతా దేశాలు ఉన్నాయని తెలుస్తోంది.

బలంగా లేవా

ప్రపంచానికి తాము ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నామని మొన్నటిదాకా చెప్పిన దేశాలు ఇప్పుడు డీలా పడుతున్న విధానం చూస్తే అవన్నీ కూడా ఉబుసుపోని కబుర్లు అని ఇప్పుడు తేటతెల్లమవుతోంది. మొన్న అమెరికా దేశాన్ని ఆర్థికష్టాలు చుట్టుముట్టాయి అని వార్తలు వచ్చాయి. దాన్ని మర్చిపోకముందే జర్మనీ దేశం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది అని సమాచారం తెలుస్తోంది. అంటే దీనిని బట్టి శ్వేత సౌధం అమెరికా అయినా, ఆడి పుట్టిన జర్మనీ అయినా.. ఆర్థికంగా చిదికి పోతున్న దేశాలే. అంతే.మ అంతకుమించి ఏమీ లేదు.