అక్రమ నిర్మాణాలను పడగొట్టే విషయంలో ఆ మధ్య హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కొంతమంది పేదలను ముందు పెట్టి ఆందోళనలు చేయడంతో హైడ్రా ఒకసారిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనికి తోడు కోర్టు తీర్పులు కూడా హైడ్రా పనితీరును ప్రభావితం చేసే విధంగా ఉండడంతో బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. ఇది సహజంగానే రేవంత్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచింది. దానికి తోడు బుల్డోజర్ న్యాయం సరికాదని రాహుల్ లాంటి వారు వ్యాఖ్యానించడం సరికొత్త చర్చలకు దారి తీసింది. ఇక హైకోర్టులు కూడా బుల్డోజర్ అన్యాయాలు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేదని వ్యాఖ్యానించాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే తీరుగా కామెంట్స్ చేసింది. బుల్డోజర్ మార్క్ న్యాయాన్ని నిలిపివేయాలని సూచనలు చేసింది. దీంతో హైడ్రా పనితీరుపై సహజంగానే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు అప్పట్లో కొద్ది రోజులపాటు హైడ్రా అధికారులు చడిచప్పుడు లేకుండా ఉండడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగిపోయినట్టేనని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ తాత్కాలికమేనని.. నీటి వనరుల సంరక్షణే తమ ధ్యేయమని హైడ్రా అధిపతి రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు.. అంతేకాదు శనివారం ఆయన అమీన్ పూర్ చెరువు ప్రాంతంలో పర్యటించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తూములు మూసివేశారు
అమీన్ పూర్ ప్రాంతంలోని చెరువు చాలా విస్తారమైనది. ఈ చెరువులో కొంతకాలంగా అక్రమాలు జరుగుతున్నాయి. గడచిన పది సంవత్సరాలలో ఇవి పెరిగిపోయాయి. ఈ చెరువు తూములు మూసి వేయడంతో లేఅవుట్లు మునిగిపోయాయి. అయితే ఈ చెరువుకు సంబంధించి ఫుల్ ట్యాంకు లెవెల్ ను పరిగణలోకి తీసుకొని సర్వే నిర్వహిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు . అప్పుడు తప్పుడు అనుమతులు ఇచ్చినవన్నీ బయటికి వస్తాయని ఆయన వివరించారు..” అనుమతులు రద్దు చేసిన వాటిని మాత్రమే మేము కూల్చి వేశాం. అనుమతులు లేకుండా ఉన్నవారి విషయంలో ఉదారత చూపించలేదు. అయితే కొంతమంది పై మాత్రమే హైడ్రా చర్యలు తీసుకోవడం వల్లే దాని పనితీరు ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. అది అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చింది. దీనిపై గ్రామాలలో కూడా చర్చ జరుగుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వాన్ని చూపించడం సరికాదు. అలా చూపిస్తే సమాజం మొత్తం బాధపడుతుంది. కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వచ్చినప్పటికీ.. అంతిమంగా అది ప్రజల మేలుకోసమే. అయితే హైడ్రాకు అందరూ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే అది చేసే పని అందరికీ అర్థమవుతుంది. చెరువులను ఆక్రమించడం వల్ల.. భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి.. వర్షాలు కురిసినప్పుడు, వరదలు సంభవించినప్పుడు నరకం చూడాల్సి వస్తుందని” రంగనాథ్ వ్యాఖ్యానించారు..” అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. ఇప్పటివరకు చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇకపై అలాంటివి జరగకుండా అడ్డుకుంటాం. ప్రజల్లో ఈ స్థాయిలో అవగాహన పెరిగింది అంటే దానికి ప్రధాన కారణం ఆడ్రానే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం గ్రామాలలో చెరువులు, నీటి కుంటలు ఆక్రమణకు గురి కాకుండా స్థానికులే నిఘా పెడుతున్నారని.. ఇది గొప్ప విషయమని” రంగనాథ్ వ్యాఖ్యానించారు. అయితే రంగనాథ్ మనసు చంపుకొని కొన్నిసార్లు పనిచేయాల్సి వస్తోందని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే వాటిని నెగిటివ్ కోణంలో చూడొద్దని రంగనాథ్ వ్యాఖ్యానించడం విశేషం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: What is this remorse in hydra commissioner ranganath what is the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com