Indian Restaurants: భారతీయ వంటకాలు అంటే ప్రత్యేకత ఉంటుది. మన వంటకాలను ఇష్టపడనివారు ఉండరు. అందుకే దేశ విదేశాల్లోనూ మన వంటకాలు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని భారతీయ వంటకాలు అందించే నాలుగు రెస్టారెంట్లు ఉత్తమమైన రెస్టారెంట్లుగా ఎంపికయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ 2024 ఏడాదికి న్యూయార్క్ నగరంలోని అత్యుత్తతమైన రెస్టారెంట్ల జాబితాను ప్రకటించింది. ఇందులో రెస్టారెంట్లపై అభిరుచిగల పీట్వెల్స్ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు స్థానం దక్కింది.
టాప్ – 100లో ఇవీ..
న్యూయార్క్ నగరంలోని అత్యుత్తమ రెస్టారెంట్లలో గ్రీన్‌విచ్ విలేజ్‌లో ఉండే సెమ్మా రెస్టారెంట్ టాప్-10లో ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది ప్రకటించిన రా‍్యంకుల్లో ఈ రెస్టారెంట్ 12వ స్థానంలో ఉంది. ఈసారి ర్యాంకు మెరుగుపర్చుకుంది. ఈ సెమ్మా రెస్టారెంట్‌ను చెఫ్ విజయ్‌కుమార్ నిర్వహిస్తున్నారు. ఈయన మంచి సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నారు. ఇక మాన్హాట్టన్ దిగువ తూర్పువైపు ఉన్న ధమాకా రెస్టారెంట్ 54వ స్థానంలో ఉంది. దీనిని చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా, రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్‌లోని టెంపుల్ క్యాంటీన్ ఉత్తమ రెస్టారెంట్లలో 80 స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది. మిడ్హన్ మాన్హాట్టలోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నంగరంలోని టాప్ 100 ఉత్తమ రెస్టారెంట్లలో 95వ స్థానంలో నిలిచింది. ఇది బిర్యానీలకు ప్రత్యేకం.