European Countries Vs America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం డెన్మార్ అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్.. అమెరికా అడగడం యూరప్ దేశాలను షాక్‌కు గురించేసింది. తాము నాటో సభ్యదేశమే అని.. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే నాటో చీలిపోతుందని డెన్మార్క్ అధ్యక్షురాలు ఇప్పటికే హ్చెరించారు. అయితే డబ్బులు ఎరవేసి కొనాలాని ట్రంప్ భావిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో ఉంటున్నవారికి 50 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించారు. కానీ, అమెరికా అడుగు పెడితే యూరప్ దేశాలకు ముప్పు తప్పదని యురోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్ మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే వంటి దేశాలు సైనిక బలగాలను మోహరించాయి. ఇది నాటో ఐక్యతకు చిహ్నంగా మారింది, అమెరికాతో ఉద్రిక్తతలు పెంచుతోంది.
చైనా, రష్యాను బూచిగా చూపి..
ట్రంప్ గ్రీన్‌లాండ్ భారీ ఖనిజ వనరులు, కార్కటిక్ రణనిర్మాణానికి కీలకమని చెప్పారు. డెన్మార్క్‌కు చెందిన ఈ ఐస్‌లాండ్‌పై అమెరికా ఆక్రమణాస్త్రత చూపడం యూరప్‌ను కలవరపెట్టింది. ఇది భౌగోళిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. రష్యా, చైనాను బూచిగా చూపి ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.
యురోపియన్ సైనికు మోహరింపు..
ఫ్రాన్స్ సైనికులు గ్రీన్‌లాండ్ రాజధాని నూక్ చేరుకున్నారు. జర్మనీ బృందాలను పంపింది. బ్రిటన్, నార్వే కూడా సైనికులను మొహరించాయి. డెన్మార్క్ ఈ చర్యలకు మద్దతుగా నిలబడింది. ఇది యూరప్ ఐక్యతను ప్రదర్శిస్తూ అమెరికా ఆశయాలకు వ్యతిరేకంగా నిలుస్తోంది.
నాటో ఐక్యతకు బీటలు..
నాటో సభ్య దేశాలు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా సైనికులను అమెరికాకు వ్యతిరేకంగా మోహరించడం నాటోలో చీలికను సూచిస్తుంది. ఇది సామూహిక రక్షణ వ్యూహంగా చూపిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ కార్కటిక్ మార్గాలు, వనరుల కోసం అమెరికా ఒత్తిడి పెరుగుతుందని అంచనా. యూరప్ దేశాలు ఇప్పుడు రక్షణ సన్నద్ధతలు పెంచుతూ అమెరికాకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి.
ఈ చర్యలు అమెరికా–యూరప్ సంబంధాల్లో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉంది. గ్రీన్‌లాండ్ వివాదం కార్కటిక్ ప్రాంతంలో కొత్త ఘర్షణలకు దారితీయవచ్చు. నాటో ఐక్యత బలపడుతూ, అమెరికా ఒంటరిగా మిగిలే ప్రమాదం ఉంది.