Homeఅంతర్జాతీయంElon Musk vs Trump: మస్క్‌ మామ కొత్త పార్టీ.. అమెరికాలో రాజ్యాధికారం సాధ్యమేనా?

మస్క్‌ మామ కొత్త పార్టీ.. అమెరికాలో రాజ్యాధికారం సాధ్యమేనా?

Elon Musk vs Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను దగ్గర ఉండి గెలిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఇందుకు కృతజ్ఞతగా ట్రంప్‌ కూడా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మస్క్‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. డోజ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ) సంస్థను ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా నియమించారు. అయితే ఆరు నెలలు తిరగకుండానే ట్రంప్‌–మస్క్‌ మధ్య విభేదాలు వచ్చాయి. డోజ్‌ నుంచి తప్పుకున్న మస్క్‌.. ట్రంప్‌ కలల బిల్లు బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును వ్యతిరేకించాడు. కానీ ట్రంప్‌ తన పంథం నెగ్గించున్నాడు. బిల్లుకు చట్టంగా మారింది. దీంతో మస్క్‌ కొత్త పార్టీ మొదలు పెట్టాడు.

Also Read: చాట్ జిపిటి సహాయం చేసింది.. ఈ మహిళ నెల రోజుల్లోనే 10 లక్షల అప్పు తీర్చేసింది..

ఎలాన్‌ మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వంటి సంస్థల సీఈవోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. తాజాగా అమెరికా రాజకీయ రంగంలో కొత్త చర్చను రేకెత్తించారు. ’బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’ పాస్‌ అయితే మూడో రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించాడు. బిల్లు చట్టరూపం పొందడంతో అమెరికాలో రెండు ప్రధాన పార్టీల (డెమోక్రటిక్, రిపబ్లికన్‌) ఆధిపత్యాన్ని సవాలు చేసేలా కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్నాడు. ఈమేరకు తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోల్‌ నిర్వహించాడు. ఇందులో 12.48 లక్షల ఓట్లు రాగా, 65.4% మంది మూడో రాజకీయ పార్టీ స్థాపనకు మద్దతు తెలిపారు. ఈ ఫలితం, అమెరికా ప్రజల్లో గణనీయమైన వర్గం ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై అసంతృప్తిని తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలు ఒక్కటే అనే అభిప్రాయం, మస్క్‌ యొక్క ’అమెరికా పార్టీ’ ఆలోచనకు బలాన్ని చేకూర్చింది.

‘అమెరికా పార్టీ’ లక్ష్యాలు
మస్క్‌ తన ట్వీట్‌లో ’ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడంమే లక్ష్యంగా ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై దృష్టి సారించే ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని సూచిస్తుంది. అయితే, ఈ పార్టీ నిర్దిష్ట విధానాలు, సిద్ధాంతాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. మస్క్‌ సాంకేతిక ఆవిష్కరణల నేపథ్యం, ఈ పార్టీ డిజిటల్‌ యుగానికి అనుగుణంగా ఆధునిక రాజకీయ పరిష్కారాలను ప్రతిపాదించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


రాజకీయంలో సవాళ్లు..
మూడో రాజకీయ పార్టీ స్థాపన అనేది అమెరికా రాజకీయ చరిత్రలో సంక్లిష్టమైన అంశం. డెమోక్రటిక్, రిపబ్లికన్‌ పార్టీల ఆధిపత్యం, ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ఆర్థిక సవాళ్లు కొత్త పార్టీకి అడ్డంకిగా ఉండవచ్చు. అయినప్పటికీ, మస్క్‌ ఆర్థిక బలం, సామాజిక మాధ్యమ ప్రభావం, ప్రజల్లో ఆదరణ ఈ సవాళ్లను అధిగమించే అవకాశం ఉంది. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండటం ఈ పార్టీకి ప్రత్యేకమైన బలంగా ఉండవచ్చు.

Also Read: అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం.. అసలేంటి బిల్.. దీంతో ఏం జరుగనుంది?

రాజ్యాధికారం సాధ్యమేనా?
’అమెరికా పార్టీ’ భవిష్యత్తు, మస్క్‌ రాజకీయ వ్యూహం అమెరికా ప్రజల మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త శక్తి ఆవశ్యకత ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ పార్టీ ఎలాంటి సిద్ధాంతాలను అవలంబిస్తుంది, ఎలాంటి నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది, మస్క్‌ ఆశించిన రాజ్యాధికారం సాధిస్తుందా అనేవి రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular