Elon Musk: గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. కరోనా ధాటికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలయ్యాయి. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ రావడంతో ఆయా దేశాలన్నీ తిరిగి గాడిన పడుతున్నాయి.

కరోనా కాలంలో లక్షలాది మంది మృత్యువాతపడగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఫార్మా, ఫుడ్, ఐటీ ఇండస్ట్రీలు మినహా మిగిలిన రంగాలన్నీ కూడా ఆర్థికంగా నష్టాలు చవిచూశాయి. అయితే ఈ కాలంలోనూ బిలియన్లు ఆదాయం ఏమాత్రం తగ్గకపోగా మరింతగా పెరగడం విశేషం.
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ సంపద కరోనా సమయంలోనే భారీగా పెరిగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2020 ప్రారంభంలో ఎలాన్ మాస్క్ సంపద 2వేల660 కోట్ల డాలర్లు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఆయన సంపద విలువ మరో 11వేల కోట్ల డాలర్లు పెరిగింది.
పోర్బ్స్ చరిత్రలో ఇన్ని కోట్ల ఆదాయం ఒక్కసారిగా పెరగడం ఇదే తొలిసారి అని ఆ సంస్థ పేర్కొవడం విశేషం. అదేవిధంగా 2021లోనూ మస్క్ సంపద మరో 9వేల కోట్ల డాలర్ల మేర పెరిగింది. మొత్తంగా పోర్బ్స్ జాబితాను పరిశీలిస్తే ఎలాన్ మాస్క్ సంపద 282 బిలియన్ డాలర్లు(సుమారు రూ.21.15 లక్షల కోట్లు) కాగా ఆ తర్వాతి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.
ఎలాన్ మస్క్ కు సంపదనకు జెఫ్ బెడోస్ సంపదనకు మధ్య వ్యత్యాసం సుమారు వంద బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. జెఫ్ బెడోస్ సంపదన సుమారు రూ.183.6 బిలియన్ డాలర్లు(సుమారు 13.77లక్షల కోట్లు)గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్వీహెచ్ఎం సీఈవో బెర్నాల్డ్ అర్నాల్ట్ సంపద 16,740 కోట్ల డాలర్లు, మైక్రో సాప్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 13వేల420 కోట్ల డాలర్లు, స్టీవ్ బాల్నార్ట్ 9వేల700 డాలర్లతో ఉన్నారు.