Elon Musk : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరో నెల రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు అధికార మార్పిడి పనులు వేగంగా జరుగుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే చేయాల్సిన పనులపై ట్రంప్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించే అవకాశం ఉంది.
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 300 పైచిలుకు ఎలక్టోరల్ ఓట్లతో గెలిచారు. 2025, జవని 20న అధికార మార్పిడి జరుగనుంది. 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తన మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసే అధికారులను కూడా నియమించారు. డబ్ల్యూహెచ్వో నుంచి కూడా వైదొలిగే ఆలోచన చేస్తున్నారు. గ్రీన్‌లాండ్, కెనడాను అమెరికాలో కలుపుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేసే ప్రణాళిక కూడా ఇప్పటికే సిద్ధమైంది. గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదంతో పాలన సాగించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు డోజ్(డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ) ఏర్పాటు చేశారు. దీనికి కో చైర్మన్లుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామిని నియమించారు. వలసల నియంత్రణతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అయితే రెండు రోజుల వ్యవధిలో కోచైర్మన్లు ఇద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
పిల్లల పెంపకంపై..
అమెరికన్లు పిల్లలను సరిగా పెంచడం లేదని వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీయులు క్రమశిణతో పెంచుతున్నారని, సామర్థ్యాలు పెంచేలా చేస్తున్నారని తెలిపారు. తద్వారా అమెరికాలో వారికి అవకాశాలు దక్కుతున్నాయని వెల్లడించారు. దీనిపై మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ కమిటీ విమర్శలు చేస్తోంది. వలసలను ప్రోత్సహించేలా రామస్వామి మాట్లాడారని విమర్శించింది. అమెరికన్ల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉందని కూడా వ్యాఖ్యానించింది. కీలక పదవుల్లో భారతీయుల నియామకాలపైనా నిరసన తెలిపింది.
తాజాగా మస్క్..
ఇక తాజాగా టెస్లా అధినేత, ఎక్స్, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీసాల పరిరక్షణకు అవసరమైతే తాను యుద్ధానికి కూడా సిద్ధమే అని స్పష్టం చేశారు. వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, కొందరు సమర్థిస్తునానరు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకరోవాలని వాటి వ్యతిరేకులు సూచిస్తున్నారు.
మస్క్ వ్యాఖ్యలు ఇలా..
ఇక వీసాల విషయంలో మస్క్ ‘నాతోపాటు ఎంతో మంది అమెరికాకు రావడానికి, స్పేస్‌ఎక్స్, టెస్లా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికి వచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకునానం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలైమన దేశంగా ఎదిగింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖత్వం. దానినే నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వీసా నిబంధనలు కఠినం..
ఇదిలా ఉంటే అమెరికా విదేశీయులకు వీసాలు జారీ చేసే విషయంలో నిబంధనలు కఠినం చేయనుంది. ఈమేరకు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ సైన్నిహితుడైన మస్క్ మాత్రం హెచ్–1బీ వీసాలు ఉండాల్సిందే అంటున్నారు. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్ క్యాలిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ నియమించారు. నిపుణులైన వలసదారుల కోసం గ్రీన్‌కారుడ పరిమితి తొలగించాలని కృష్ణన్ కోరారు. దీనిని రిపబ్లికన్ నేతలు తప్పు పడుతున్నారు. దీంతో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.