https://oktelugu.com/

China : భార్యతో విడాకులు.. దానికి తోడు ఆస్తివివాదం.. విరక్తితో 35 మందిని చంపేశాడు.. వైరల్ వీడియో

మనిషి విచక్షణను కోల్పోతే ఎంతటి ఉన్మాదిగా మారతాడో ఈ సంఘటనే ఓ ప్రబల ఉదాహరణ. అతడు చేసిన నిర్వాకం వల్ల ఏకంగా 35 మంది చనిపోయారు. 43 మంది గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 12, 2024 / 11:51 PM IST
    Follow us on

    China గ్లోబల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చైనా దేశానికి చెందిన 62 సంవత్సరాల వ్యక్తికి భార్యతో విడాకులు అయ్యాయి. ఆ విడాకులు అనంతరం ఆమె ఆస్తిలో వాటా అడుగుతోంది. అది ఇవ్వడం ఆ వ్యక్తికి ఇష్టం లేదు. దీంతో వివాదం మొదలైంది. ఆవివాదం అంతకంతకు పెరుగుతోంది. ఇది అతడికి తీవ్రంగా ఇబ్బంది కలగజేస్తోంది. తన మాజీ భార్య ఆస్తికోసం పెడుతున్న చికాకులు అతడిని ఉన్మాదిగా మార్చాయి. దీంతో అతడు ఒక పైశాచిక నిర్ణయం తీసుకున్నాడు. సేమ్ స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య లాగా మనుషులను చంపడం మొదలుపెట్టాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 35 మందిని పొట్టన పెట్టుకున్నాడు. 43 మందిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటన చైనాలోని జుహై నగరంలో చోటుచేసుకుంది..

    35 మంది మరణించారు

    చైనాలోని జుహై నగరంలో ఓ క్రీడా కేంద్రం ఉంది. అక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రజలు వ్యాయామం చేస్తుంటారు. అక్కడ 62 ఏళ్లు వృద్ధుడు తన కారుతో వ్యాయామం చేస్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 35 మంది చనిపోయారు. విచక్షణారహితంగా కారును అత్యంత వేగంగా నడపడంతో వ్యాయామం చేస్తున్నవారు ఆ కారు టైర్ల కింద పడి చనిపోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఆ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ” అతడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె ఆస్తిలో వాటా అడుగుతోంది. స్థానికంగా ఉన్న కోర్టు కూడా అదేవిధంగా తీర్పు ఇచ్చింది. ఆ ఆస్తి ఇవ్వడం అతనికి ఇష్టం లేదు. దీంతో కొంతకాలంగా ఈ కేసు పెండింగ్లో ఉంది. ఆస్తి కోసం ఆయన మాజీ భార్య ఒత్తిడి తీసుకొస్తోంది. ఇది 62 సంవత్సరాల వ్యక్తిని తీవ్రమైన కలతకు గురిచేస్తోంది. దీంతో అతడు తన మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఉన్మాది లాగా మారిపోయాడు. ప్రజలపైకి కారును ఇష్టానుసారంగా నడిపాడు. ఏకంగా 35 మంది మరణానికి కారణమయ్యాడు. 43 మంది అతడు చేసిన నిర్వాకం వల్ల గాయపడ్డారు. ఈ ఘటన పై విచారణ కొనసాగిస్తున్నాం. అతనికి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఈ ఘటన వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని” చైనా పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ మీడియా కూడా ఈ ఘటనపై కథనాలను ప్రసారం చేస్తోంది.