https://oktelugu.com/

Japan Earthquake: భారీ భూకంపం.. సునామీ భయంతో వణుకుతున్న పలు దేశాలు!

మొదటి భూకంపం సంభవించిన కాసేపటికే 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని సముద్రపు అలలు తాకాయి.

Written By: , Updated On : April 3, 2024 / 09:44 AM IST
Japan Earthquake

Japan Earthquake

Follow us on

Japan Earthquake: తైవాన్, జపాన్‌ దక్షిణ ప్రాంత దీవులను భూకంపం అతలాకుతం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆ దేశ భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా నమోదైనట్లు గుర్తించింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే దీనిని 7.4గా ప్రకటించింది. ఇక భూకంప కేంద్రం తైవాన్‌లోని హువాలియెన్‌ పట్టణానికి నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

మరో భూకంపం..
మొదటి భూకంపం సంభవించిన కాసేపటికే 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌ పట్టణాన్ని సముద్రపు అలలు తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక ఐదు అంతస్తుల భవనం 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. తైవాన్‌ రాజధాని తైపీలో అనేక బిల్డింగులకు పగుళ్లు వచ్చాయి.

జపాన్‌లోనూ నష్టం..
జపాన్‌లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒకినావా ద్వీప సమూహంలో మూడు మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్‌ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యొనుగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. వియాకో, యేయామా ద్వీపాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని వెల్లడించింది. 199 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే అని నిపుణులు చెబుతున్నారు.