Sreeleela: ఆ స్టార్ హీరో వల్ల శ్రీ లీల కెరీర్ నాశనం అయిందా?

మహేష్ బాబుకు ఈ సినిమా రిజల్ట్ పెద్దగా కెరీర్ పై నష్టాన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే మిల్క్ స్టార్ తన తదుపరి సినిమాను ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తో తెరకెక్కిస్తున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : April 3, 2024 9:50 am

Sreeleela

Follow us on

Sreeleela: ఒక హిట్ పడితే వరుస సినిమాలు, ఒక ఫ్లాప్ పడితే కెరీర్ డల్ గా కొనసాగడం ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటుంది. మరి రీసెంట్ గా వచ్చిన గుంటూరు సినిమాతో శ్రీలీలకు కూడా ఈ సినిమా ప్లస్ అయిందా? మైనస్ అయిందా అని చర్చించుకుంటున్నారు అభిమానులు. అయితే ఈ సినిమా త్రివిక్రమ్, మహేష్ లకు ఎలాంటి టాక్ ను తెచ్చిపెట్టింది అనేది పెద్దగా అవసరం లేదు. కానీ శ్రీలీల కెరీర్ కు మాత్రం చాలా ఇంపార్టెంట్.. ఇంతకీ ఈ సినిమాతో శ్రీలీల కెరీర్ ఏమైందంటే..

మహేష్ బాబుకు ఈ సినిమా రిజల్ట్ పెద్దగా కెరీర్ పై నష్టాన్ని చూపించకపోవచ్చు. ఎందుకంటే మిల్క్ స్టార్ తన తదుపరి సినిమాను ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి తో తెరకెక్కిస్తున్నారు. జక్కన్న సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అటు త్రివిక్రమ్ కూడా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాడు. కానీ శ్రీలీలకే ఈ సినిమా కొంచెం ఢీలా రిజల్ట్ ను ఇచ్చినట్టు ఉంది. ఈ సినిమాలో శ్రీ లీల ఎంత కష్టపడాలో అంత కష్టపడింది.

డ్యాన్స్ ను ఇరగదీసింది. మహేష్, శ్రీలీల డ్యాన్స్ వల్లే ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. మిడ్ రేంజ్ హీరోల పక్కన నటిస్తున్న సమయంలోనే సడన్ గా గుంటూరు కారం అంటూ మహేష్ సరసన మెయిన్ లీడ్ చాన్స్ వచ్చింది. కానీ సినిమా పెద్దగా హిట్ అవలేదు. దీంతో కెరీర్ లో కాస్త మైనస్ గా మారింది ఈ సినిమా. ఇప్పటికే మిడ్ రేంజ్ లో చాలా మంది హీరోల సరసన నటించింది శ్రీ. ఇంకా నటించని హీరోలు కూడా ఉన్నారు కానీ వారు కూడా పరాజయాల పాలు అవుతూ వస్తున్నారు. దీంతో ఈ అమ్మడు కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమా చేస్తుంది శ్రీ లీల. పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే నాని, శర్వానంద్, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ పాపులర్ హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకోలేదు. నితిన్, పవన్ ల సరసన సినిమాలు హిట్ అయితే ఆమె కెరీర్ కు ఢోకా ఉండదు. కానీ కొంచెం నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఇక శ్రీ లీల కెరీర్ లో కష్టాలు మొదలు అయినట్టే. మరి ఈ అమ్మడు కెరీర్ ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.