Pakistan Copied Durandhar: తప్పులేదు. కచ్చితంగా తప్పులేదు.. పులిలాగా ఉండాలని వీధి కుక్క అనుకోవడంలో తప్పులేదు. అడవిలో పులి మాదిరిగా గర్జించాలి అనుకోవడంలో తప్పులేదు. ప్రత్యర్థి జంతువును వేటాడాలనుకోడంలో కూడా తప్పులేదు. కానీ ఇవన్నీ ఎవరు చేయాలి.. పులి మాత్రమే చేయాలి. కుక్క అనుకోవడం వరకు బాగానే ఉంటుంది. కానీ పులి మాదిరిగా చేయాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే వీధిలో కుక్క అరిచే అరుపుకు.. దట్టమైన అడవిలో పులి పంజాకు చాలా తేడా ఉంటుంది.
భారత్ లో ఆదిత్య ధర్ అనే దర్శకుడు దురంధర్ అనే సినిమా తీశాడు. పాకిస్తాన్ భారత్ మీద ఎలాంటి పన్నాగం పన్నింది.. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఎలాంటి కుట్రలు చేసింది.. దీనికి ప్రతిగా భారత్ పాకిస్థాన్లో ఎటువంటి గూడ చర్య వ్యవస్థను నిర్వహిస్తోంది.. కరాచీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ల్యాలీ అనే ప్రాంతంలో భారత గూడచారులు ఎలాంటి ఆపరేషన్లు చేశారు.. తద్వారా ఉగ్రవాదం ఎలా అణచివేతకు గురైంది.. ఇలాంటి అంశాల ఆధారంగా దురంధర్ సినిమా రూపొందింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల మార్కెట్ సాధించగలిగింది. బాహుబలి రికార్డులను బద్దలు కొట్టగలిగింది.
పాకిస్తాన్ దేశానికి దురంధర్ సినిమా వ్యతిరేకంగా ఉండడంతో.. మొదటినుంచి కూడా అక్కడి పాలకులు ఈ సినిమా మీద తమ అక్కసు ప్రదర్శించారు. పాకిస్థాన్లో ఈ సినిమాను ప్రదర్శితం కాకుండా అడ్డుకున్నారు. అయితే చాలామంది పాకిస్తాన్ ప్రజలు ఈ సినిమాను ఆన్లైన్లో.. ఇతర మాధ్యమాలలో చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత పాకిస్తాన్ పాలకుల మీద అక్కడి ప్రజలు కాండ్రించి ఉమ్మడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో కొంత మందికి కొత్త ఆలోచన వచ్చింది. దురంధర్ మించిన సినిమాను చేస్తామని వారు ప్రకటించారు. ప్రకటించడం మాత్రమే కాదు మేవీ ల్యాలీ అనే పేరుతో ఒక సినిమాను కూడా తీశారు విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన రోజే బాక్సులు వెనక్కి వెళ్ళాయి. ఐదు షోలు ప్రదర్శిస్తే కేవలం 22 మంది మాత్రమే వచ్చారు. దీనిని బట్టి పాకిస్తాన్ దురంధర్ ను కాపీ కొట్టి ఏదో చేయాలనుకుంటే.. ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసింది. అంతేకాదు భారత్ మీద కుట్రలు చేసేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. మేవీ ల్యాలీ సినిమాలో ల్యాలీ ప్రాంతం గొప్పదనాన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రారంభం నుంచి చివరి దాకా బోరింగ్ సినిమా లాగా అది మిగిలిపోయింది. కేవలం ఒక్క రోజులోనే బాక్సులు వెళ్లిపోయాయి అంటే ఆ సినిమా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ కథనం ప్రారంభంలో కుక్క, పులి గురించి ప్రస్తావించాం. కథనం మొత్తం చదివారు కదా.. దీనిని బట్టి పులి ఎవరు.. కుక్క ఎవరు అనేది అర్థమైంది అనుకుంటా.