Veerabhadrudu Movie 2 Days Collections: ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో సూర్య లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. మే 14 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఆలస్యంగా విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజు దాదాపుగా 28 నుండి 30 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు అయితే అన్ని ప్రాంతాల్లోనూ మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి నమోదైన రెండవ రోజు గ్రాస్ వసూళ్లు , సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు , ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.
తమిళనాడు ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా రెండు రోజుల్లో 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఏకంగా 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి రెండవ రోజున మంచి గ్రోత్ కనిపించింది, ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 3 కోట్ల 8 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు 4 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 7 కోట్ల 63 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు , సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య కి ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు.
అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 5 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కేరళ నుండి 3 కోట్ల 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 80 లక్షలు, ఓవర్సీస్ నుండి 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని 50 శాతం కి పైగా అందుకున్న ఈ చిత్రం , రాబోయే రోజుల్లో మరో 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది.