Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్ మూడో టర్మ్ సంకేతాలు.. సిన్న శకలు లేవు సామీ!

Donald Trump: ట్రంప్ మూడో టర్మ్ సంకేతాలు.. సిన్న శకలు లేవు సామీ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఏడు పదులు దాటింది. కానీ మనోడి కోరికలు మాత్రం గుర్రాల్లా పరిగెడుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సైన్యం బలోపేతం విషయంలో మూడో పర్యాయం కూడా కొనసాగిస్తామని సూచించారు. వెంటనే తన మాటను సరిదిద్దుకున్నప్పటికీ, ఈ వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఆకాంక్షలపై కొత్త చర్చను రేకెత్తించాయి.

ట్రంప్ ఏమన్నాడంటే..
అమెరికాకు స్వాతంత్రం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మొదటి పర్యాయంలో సైన్యాన్ని బలపరిచామని చెప్పి, రెండో పర్యాయంలోనూ అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే “రెండోది… కాదు, మూడో టర్మ్‌లో కూడా” అని అనడం అందరి దృష్టి ఆకర్షించింది. వెంటనే తేరుకున్న తర్వాత ఆయన “అలా అనకూడదు” అంటూ వెనక్కి. తగ్గారు. ఇది కేవలం ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గతంలో కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన నిజంగా మూడో పర్యాయం గురించి ఆలోచిస్తున్నారా లేదా రాజకీయంగా దృష్టిని ఆకర్షించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తాయి.

రాజ్యాంగ నిబంధనలు ఇలా..
అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణ స్పష్టంగా ఏ వ్యక్తి అయినా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండలేడని నిర్దేశిస్తుంది. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణకు అవసరమైన కఠినమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ, రాష్ట్రాల్లో మూడింట నాలుగు వంతుల ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను చాలామంది రాజకీయ స్టంట్‌గా భావిస్తున్నారు. అయితే ఆయన మాటలు ఆయన మద్దతుదారుల్లో ఉత్సాహం కలిగించగా, ప్రత్యర్థుల్లో ఆందోళన రేకెత్తించాయి.

గత సంకేతాలు, ప్రస్తుత చర్చ..
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన మూడో పర్యాయం గురించి సంకేతాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చ జోరందుకుంది. కొందరు దీన్ని ట్రంప్ తన బలమైన మద్దతు వర్గాన్ని కదిలించడానికి, రిపబ్లికన్ పార్టీలో తన ప్రభావాన్ని కొనసాగించడానికి చేసిన ప్రయత్నంగా చూస్తున్నారు. మరికొందరు ఇది భవిష్యత్తులో రాజ్యాంగ మార్పుల గురించి చర్చను రేకెత్తించడానికి ఉద్దేశించినదిగా అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ రచ్చ..
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో రెండు వైపులా ప్రభావం చూపుతున్నాయి. ఆయన మద్దతుదారులు దీన్ని ఆయన నాయకత్వ బలానికి సంకేతంగా చూస్తుంటే, ప్రత్యర్థులు దీన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అధ్యక్ష పదవికి రెండు పర్యాయాలు మాత్రమే అనుమతించే నిబంధనను మార్చడం చాలా కష్టం. అయినప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ట్రంప్ ఇప్పటికే వలస విధానాలు, వాణిజ్య విధానాలతో తీవ్ర చర్చలను రేకెత్తించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు మూడో టర్మ్ సంకేతం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ట్రంప్ మూడో పర్యాయం గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్టంట్ అని కొంతమంది భావిస్తున్నారు. మరికొందరు నిజమైన ఆకాంక్ష అంటున్నారు. అయితే రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన పరిమితులను అధిగమించడం చాలా కష్టం. ఇది ట్రంప్ రాజకీయ ఆకాంక్షలు ఎంతవరకు వెళ్తాయనే చర్చను రేకెత్తించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version