Donald Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో వాణిజ్యం చేసేవారిపై 25% అదనపు సుంకాలు విధిస్తామని ప్రకటించారు. భారత్‌పై ఇప్పటికే 50% టారిఫ్‌లు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వర్గాల్లో ఆందోళన పెరిగింది. కొత్త టారిఫ్‌తో సుంకాల భారం 75 శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది. ట్రంప్ ప్రకటన భారత వ్యాపారులను కలవరపరిచింది. ఇరాన్‌తో ముడిపడిన ఆర్థిక లావాదేవీలపై కొత్త భారం పడుతోంది. అయితే, ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా.
భారత్ బంధంపై కీలక నిర్ణయం..
సుంకాల బెదిరిపుల నేపథ్యంలో తాజాగా అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్యాక్ సిలికా టెక్ అలయన్స్‌లో భారతానికి ఆహ్వానం పలికింది. ఈమేరకు భారత్‌లోని రాయబారి సర్గియోగోర్ పేర్కొన్నారు. ఎనిమిది దేశాలతోపాటు భారతం చేరిక అవసరమని స్పష్టం చేశారు. మరోవైపు జీ7 క్రిటికల్ మినరల్స్ ఫోరమ్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలు ద్వైపాక్షిక బలాన్ని తెలియజేస్తున్నాయి.
చైనాతో కలవకుండా చర్యలు..
చైనా–భారత సమీపీకరణ అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చైనా నాయకులు భారత్‌లో పర్యటించారు. బీజేపీ నేతలను కలిశారు. 2009 లో చైనా ప్రతినిధులు బీజేపీ నేతలను కలిశారు. 17 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని కలిశారు. ఇది అమెరికాను ఆందోళనకు గురిచేసింది. దీంతో వెంటనే ట్రంప్ భారత్‌ను అమెరికావైపు తిప్పుకునే ప్రయత్నం చేపట్టారు. ఇందులో భాగంగానే ప్యాక్ సిలికా టెక్ అలయన్స్‌లోకి ఆహ్వానించారు.
షేక్స్‌గాం వ్యాలీ వివాదం..
ఇదిలా ఉంటే చైనా–భారత్ మధ్య మరో అంశం వివాదాస్పదంగా మారింది. పీవోకేలోని షేక్సగాం వ్యాలీ మీదుగా పాకిస్తాన్–చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. అయితే దీనిని భారత్ తప్పు పట్టింది. షేక్స్‌గాం వ్యాలీ భారత్‌ది అని.. దానిపై చేపట్టే ప్రాజెక్టును తాము గుర్తించమని స్పష్టం చేసింది. మరోవైపు చైనా అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ మోసపూరితంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే అరుణాచల్‌ప్రదేశ్ యువతిని ఎయిర్ పోర్టులో ఇబ్బంది పెట్టింది. అయితే చైనా భారత్‌కు రావడం, భారత ప్రధాని ఇటీవల చైనాకు వెళ్లడం అమెరికాకు ఇబ్బందిగా మారింది. అజిత్‌ధోవల్ కూడా త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా రాయభారి భారత్ అమెరికాకు శాశ్వత మిత్రుడు అని ప్రకటించారు.
బయటకు వస్తున్న ఇరాన్ అల్లర్ల దృశ్యాలు..
ఇక మరోవైపు ఇరాన్‌పై దాడికి అమెరికా సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పౌరులకు మద్దతు తెలిపారు. ఆర్థికసాయం చేస్తామని, అల్లర్లు కొనసాగించాలని సూచించారు. ఇరాన్‌లో ప్రభుత్వం మారడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్ అల్లర్లు బయటకు రాకుండా ఇంటర్నెట్‌ను ఇరాన్ నిలిపివేసింది. కానీ ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ నెట్‌వర్కా ద్వారా ఇరాన్‌లోని దృశ్యాలు బయటకు వస్తున్నాయి. స్టార్‌లింక్ నెట్‌వర్క్ మొత్తం శాటిలైట్ ద్వారానే జరుగుతుంది. దీంతో ఇరాన్ దీనిని కంట్రోల్ చేయలేకపోతోంది.
ఈ పరిణామాలు భారత విదేశాంగ వ్యూహాన్ని పరీక్షిస్తున్నాయి. అమెరికా ఆహ్వానాలు సానుకూల సంకేతాలు.