Donald Trump Son: డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రెండుసారి ఎన్నికయ్యారు. పది నెలల పాలనలో వివాదాస్పద నిర్ణయాలతో అందరికీ శత్రువుగా మారాడు. చివరకు అమెరికన్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా నెలరోజులుగా షట్‌డౌన్ ఎదుర్కొంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ భారత్‌లో పర్యటించారు. తెలంగాణకు కూడా వచ్చారు. ఇక ట్రంప్ 2.0 పాలనలో ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ భారత్‌కు వచ్చాడు. ఢిల్లీలోని తాజ్ మహల్ సందర్శించి, అనంత్ అంబానీ వంతారా వన్యప్రాణుల కేంద్రం గుండా, గణపతి ఆలయంలో పూజలు చేసి దాండియా ఆడారు.
Also Read: చంద్రబాబు రైతు బాట!
మూడు రోజుల పర్యటనకు..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ప్రస్తుతం భారత రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబాని కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లతో కలిసి గుజరాత్‌లో వంతారా వన్యప్రాణుల రక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడటం, కేంద్రం వివరాలు తెలుసుకోవటం జరిగింది. అనంతరం స్థానిక గణపతి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.
జూనియర్ ట్రంప్‌తో అనంత్ అంబానీ దంపతులు..
ఈ సందర్శనలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లతో కలిసి ట్రంప్ జూనియర్ దాండియా చేయడం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ జూనియర్ పర్యటనలో ముందుగా ఢిల్లీ తదుపరి అగ్రాలోని తాజ్ మహల్‌ను కూడా గురువారం సందర్శించారు. అక్కడి డయానా బెం^Œ సహా పలు ఏరియాల్లో ఫొటోలు దిగారు. అక్కడ స్మారకం గురించి గూర్చి వివిధ ప్రశ్నలు అడిగి తాను చూపిన ఆసక్తిని వెల్లడించారు. ట్రంప్ జూనియర్ ఈ సందర్శనలో, ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో జరిగే హైదరాబాదీ–అమెరికన్ సామాన్యుల వివాహ మహోత్సవంలో పాల్గొనబోతున్నారు.
#WATCH | Uttar Pradesh: American businessman and son of US President Donald Trump, Donald Trump Jr. visits the Taj Mahal in Agra. pic.twitter.com/88v0QnHTV0
— ANI (@ANI) November 20, 2025