India Iran oil sanctions news: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం కారణంగానే రష్యా ఉక్రోయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. భారత్‌పై ఆంక్షలు విధించాలని యురోపియన్ యూనియన్ కోరారు. ఆయిల్ దిగుమతులను సాకుగా చూపి 25 శాతం అదనపు సుంకాలు విధించారు. అయితే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసింది. అయినా సుంకాలు తొలగించలేదు. రష్యాలోని ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించారు. అందులో మనకు ఇంధనం సరఫరా చేసే కంపెనీసైతం ఉంది. ఇక ఇప్పుడు తాజాగా ఇరాన్ చమురు సరఫరాపైంక్షలు విధించారు. ఈ క్రమంలో భారత కంపెనీలపైగా ఆంక్షలు విధించారు.
Also Read: దాండియా ఆట.. వంతారా సందర్శన.. ఇండియా టూర్ ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ట్రంప్!
ఇరాన్ టార్గెట్‌గా..
అమెరికా ప్రభుత్వం ఇరాన్ ముడి చమురును వివిధ దేశాలకు సరఫరా చేయకుండా అడ్డుకొనేందుకు పలు సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారతదేశంలోని టీఆర్6 పెట్రో కంపెనీ, ఆర్‌ఎన్ షిప్ మేనేజ్మెంట్ సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ చర్యలు ఇరాన్ సైనిక కార్యకలాపాలకు నిధులు నిలిపివేసేందుకు, అణ్వాయుధ అభివృద్ధి, ఉగ్రవాద ప్రాక్సీలకు మద్దతు అందకుండా చేయడమనే లక్ష్యంతో చేపట్టబడుతున్నాయి.
Also Read: బంగ్లాదేశ్ లో భూ ప్రకంపనలు.. వణికిన కోల్ కతా
విమాన సర్వీస్‌లపైనా..
ఇరాన్‌కు చెందిన ప్రముఖ ప్రైవేటు ఎయిర్‌లైన్స్, మహార్‌ఎయిర్, యాజ్‌డ్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్‌పై కూడా ఆంక్షలు విధించారు. ఈ విమానయాన సంస్థలు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్‌స్(ఐఆర్‌జీసీ)తో సన్నిహితంగా పనిచేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సిరియా, లెబనాన్‌లోని ఇరానియన్ ప్రాక్సీలకు ఆయుధాలు, సిబ్బంది రవాణాకు ఈ సంస్థలు సహకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక ఒత్తిడిలో పడిపోయే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. భారత సంస్థలపై పెట్టిన చర్యలు, ఆర్థిక కార్యకలాపాల్లో అంతర్జాతీయ నియమాలపై ఇబ్బందులను సూచిస్తున్నాయి.