Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బైడెన్‌పై వీలైన ప్రతీసారి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బైడెన్ ట్రంప్‌ను ఓడించి అధికారం చేపట్టారు. ఆ సమయంలో ట్రంప్ వైట్‌హౌస్ వద్ద పెద్ద రచ్చే చేశారు. దీంతో బైడెన్ ప్రభుత్వం ట్రంప్‌పై పలు కేసులు పెట్టింది. అవి విచారణ జరుగుతున్నాయి. కొన్నింటిలో శిక్ష కూడా పడింది. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధ్యక్షుడు అయ్యాడు. దీంతో ఇప్పుడు ట్రంప్.. బైడెన్‌పై ప్రతీకారం తీసుకుంటున్నారు.
ఆటోపెన్ సంతకాలకు చెక్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆటోపెన్ ద్వారా సంతకం చేసిన అన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు, ఒప్పందాలు, మెమోరాండమ్‌లను చెల్లవని ప్రకటించారు. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌తో ఒక పోస్టు చేశారు. బైడెన్ పదవీకాలంలో 92 శాతం డాక్యుమెంట్లు ఆటోపెన్‌తో సంతకం చేయబడ్డాయని ఆరోపించారు. ఈ చర్యలు బైడెన్ క్షమాభిక్షలు, రవాణా ఆర్డర్లు సహా అనేక చట్టాలను ప్రభావితం చేయవచ్చు.
ఆటోపెన్ వాడకం వివాదం
ఆటోపెన్ అనేది అధ్యక్షులు సంతకాలను యాంత్రికంగా పునరావృతం చేసే సాధనం, ఇది గత అధ్యక్షులు కూడా ఉపయోగించారు. ట్రంప్ దీనిని బైడెన్ సిబ్బంది అనుమతి లేకుండా వాడారని, బైడెన్ ఆరోగ్య సమస్యల వల్ల తెలియకుండా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రకటన ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత బైడెన్ ఆర్డర్లను రద్దు చేసే సందర్భంలో వచ్చింది.
చట్టపరమైన సవాల్..
ఆటోపెన్ సంతకాలు చట్టబద్ధమేనని, ఇవి అధ్యక్షుడి అనుమతితోనే జరుగుతాయని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మార్గదర్శకాలు మద్దతుగా ఉన్నాయని, కానీ ఇది రాజకీయంగా ప్రేరేపితమని విమర్శలు వస్తున్నాయి. బైడెన్ ఈ ఆరోపణలను ఖండించి, తన నిర్ణయాలు అందరూ తెలుసుకుని తీసుకున్నవని పేర్కొన్నారు.
ట్రంప్ నిర్ణయం బైడెన్ యుగ ఆర్డర్లను పూర్తిగా ప్రభావితం చేయకపోయినా, కొత్త విధానాలకు మార్గం సుగమం చేస్తుంది. ట్రంప్ గతంలోనూ బైడెన్ మానసిక స్థితి, క్షమాభిక్షలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తిస్తోంది.