Labour Codes 2025: ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని అనుకుంటారు. కానీ అందరూ అనుకున్న గమ్యాన్ని చేరుకోలేరు. అయితే ఆర్థిక అవసరాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి చిన్న ఉద్యోగం అయినా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఎక్కడైనా ఉద్యోగ అవసరం ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి జాబ్ కోసం అడుగుతూ ఉంటారు. అయితే మొన్నటి వరకు చిన్న ఉద్యోగం చేసే వారికి ఎలాంటి ప్రయోజనాలు లేవు. కానీ కొత్తగా లేబర్ కోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి కొత్తగా వచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఒక షాప్ లేదా చిన్న సంస్థలో ఉద్యోగం అంటే కేవలం పనికి తగిన జీతం ఇచ్చేవారు. ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. కనీసం వారు ఉద్యోగం చేస్తున్నట్లు ఎలాంటి గుర్తింపు లేదా ఐడెంటిటీ ఉండేది కాదు. కానీ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ ప్రకారం ఏ సంస్థ అయినా ఉద్యోగిని నియమించుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే. అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఎవరినీ నియమించుకోవడానికి ఆస్కారం లేదు. ఈ అపాయింట్మెంట్ లెటర్ ద్వారా ఉద్యోగికి గుర్తింపు ఉండడంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లా ఉపయోగపడుతుంది. అతను ఇక్కడ ఎన్నాళ్లపాటు చేశాడో.. దాని ఆధారంగా మరో ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా అపాయింట్మెంట్ లెటర్లో ఉద్యోగికి సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయి. 20 మంది ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలో ఇప్పటివరకు ఈపీఎఫ్ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ ఉండాల్సిందేనని కొత్త లేబర్ కోడ్ తెలుపుతోంది. అలాగే ఆర్గనైజ్డ్, అన్ ఆర్గనైసేడ్ సంస్థల్లో ఉన్న ఉద్యోగికి కనీస వేతనం ఇవ్వాలని తెలిపింది. గతంలో వారు నిర్ణయించుకున్న జీతం మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లేబర్ కోడ్ యాక్ట్ ప్రకారం గా జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జీవితంలో ఎక్కువ భాగం పిఎఫ్, గ్రాట్యుటీ కి వెళ్తుంది. దీర్ఘకాలంలో ఇది ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
మొన్నటివరకు గిగ్ వర్కర్లు, ఫ్రీలాన్స్ సర్వీస్ చేసే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు వీరికి సైతం సామాజిక భద్రతను కలిగిస్తున్నాయి. వీరికి లైఫ్ ఇన్సూరెన్స్, డిజేబులిటీ కవర్, హెల్త్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు ఉండనున్నాయి. గతంలో గ్రాట్యుటీ రావాలంటే కనీసం ఐదు సంవత్సరాల పాటు ఒక సంస్థలో పనిచేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఏడాది పని చేసినా కూడా గ్రాట్యూటీ లభిస్తుంది. ఇది ఉద్యోగి సంస్థ నుంచి వెళ్ళిపోయే సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. అలాగే ఓవర్ టైం పనిచేసే వారికి అదనంగా ఆదాయం ఇవ్వాలని కూడా కొత్త లేబర్ కోడ్ తెలుపుతోంది. ఈ రకంగా అదనంగా పనిచేసిన వారి కి ప్రయోజనాలు కలగనున్నాయి.