Donald Trump Comments On Russia: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఓవైపు దేశంలో సుంకాలను విధిస్తూ.. మరోవైపు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తొలగించి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తాజాగా చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల ఏళ్ల మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన ఫోన్ వివరాల ను విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ఈ సమావేశంలో ఆయన ఆసక్తికర విషయాలను చెప్పారు. అవేంటంటే?
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఒక విలేఖరి ఈ విధంగా ప్రశ్నించారు. “ఉక్రెయిన్ కు తొమహాక్ క్షిపణులు ఇవ్వద్దని పుతిన్ మిమ్మల్ని కోరారా”? అని అడిగారు. ఈ సందర్భంగా ట్రంప్ వ్యంగంగా స్పందించారు.తొమహాక్ క్షిపణులు ఇవ్వండి అని ఎవరైనా అడుగుతారా? అని సమాధానం ఇచ్చాడు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ చెప్పిన విషయం ఏంటంటే తాను చేసిన ప్రతిపాదనకు పుతిన్ వ్యతిరేకంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి యుద్ధం లేకుండా తాము చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని.. నేను చేసే ప్రతిపాదన రష్యా అధ్యక్షుడికి నచ్చడం లేదని నిరాశతో చెప్పాడు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు అలాంటి భారీ విధ్వంసం సృష్టించే క్షిపణులు ఎందుకు ఇస్తానని పరోక్షంగా చెప్పాడు.
అయితే మొన్నటికి మొన్న భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పిన ట్రంప్.. ఇప్పుడు గత ఏడాది నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నానని అంటున్నాడు. ప్రపంచంలో ఏ దేశం అయినా తాను చెప్పిందే వినాలి అని ట్రంప్ కోరుకుంటున్నారని.. కానీ అన్ని దేశాలు ఒకేలా ఉండవని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం అని తొలగించేందుకు దౌత్య సంబంధాలు నెలకొల్పాలని.. ఇలా ఒక దేశం పై దాడి చేయడానికి మరో దేశానికి ఆయుధాలు ఇవ్వడం.. ఇవ్వాలని అనుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదన్న చర్చ సాగుతోంది.