JATADHARA Telugu Trailer Riview : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 16 ఏళ్ళు అవుతున్నా, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోయిన హీరోలలో ఒకరు సుధీర్ బాబు(Sudheer Babu). మహేష్ బాబు(Superstar Mahesh Babu) బావ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ హీరో కెరీర్ లో సక్సెస్ కాలేకపోయాడు. కెరీర్ మొత్తం మీద ‘ప్రేమ కథా చిత్రం’ తప్ప మరో హిట్ సినిమా లేదు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, యాక్టింగ్, డ్యాన్స్ టాలెంట్ ఉంది, ఫైట్స్ బాగా చేస్తాడు, బాగా కష్టపడే తత్త్వం ఉంది, ఇలా స్టార్ హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల, కనీసం మీడియం రేంజ్ లో కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోయాడు. సక్సెస్ లేకపోయినప్పటికీ, అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ఆయన ‘జటాధర'(Jatadhara Movie) అనే చిత్రం చేసాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా పై సుధీర్ బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు.
నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ని చూస్తుంటే ఇందులో సుధీర్ బాబు తన నట విశ్వరూపం చూపించినట్టు తెలుస్తుంది. స్టోరీ కూడా ఆసక్తి కరంగా ఉంది. ఒక ఇంట్లో లంకె బిందెలు ఉంటాయి. ఆ లంకె బిందెలకు కాపలాగా ధన పిశాచి ఉంటుంది. ఆ ఇంట్లో నివసించే వాళ్లకు లంకె బిందెలు చూసినప్పటి నుండి ధన పిశాచి నుండి ఘోరమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఆ ధన పిశాచి ని అంతం చేసి, హీరో తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే స్టోరీ అని ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు, ట్రైలర్ లోని చివరి షాట్ మరో ఎత్తు.
సుధీర్ బాబు నేల మీద పడున్న రక్తాన్ని నాకుతూ తిరగడం హైలైట్ గా నిల్చింది. ఇకపోతే ఇందులో ధన పిశాచి గా, ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించింది. ఇన్ని ఏళ్ళ తన కెరీర్ లో సున్నితమైన హీరోయిన్ రోల్స్ చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సోనాక్షి సిన్హా, మొట్టమొదటిసారి ‘జటాధర’ చిత్రం ద్వారా క్రూరమైన విలన్ గా వెండితెర పై కనిపించబోతుంది. ట్రైలర్ లో హీరో సుధీర్ బాబు తో వీరోచితంగా ఫైటింగ్స్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి విలన్ రోల్ చేయడానికి చాలా డేరింగ్ ఉండాలి. ఆ విషయం లో సోనాక్షి సిన్హా ని మెచ్చుకోవచ్చు. యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ ‘జటాధర’ ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము,చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
