https://oktelugu.com/

Donald Trump: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి ట్రంప్‌ ముగింపు.. వ్యూహం సిద్ధం చేస్తున్న కొత్త అధ్యక్షుడు!

అమెరికా అధ్యక్షుడిగా తాను అధికారం చేపట్టిన 24 గంటల్లో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇప్పుడు ఆ మేరు అడుగులు వేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 10, 2024 12:18 pm

Donald Trump(14)

Follow us on

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధినేతగా డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా ఆరిజోనా ఫలితాలతో ట్రంప్‌ మెజారిటీ 312కు చేరింది. కమలా హారిస్‌ 226కు పరిమితమయ్యారు. ఇక అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో.. ట్రంప్‌ పదే పదే.. తాను అధికారం చేపట్టిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాకి ముగింపు పలుకుతానని ప్రకటించారు. అమెరికా సొమ్మును యుద్ధానికి ఖర్చు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజల సొమ్ము అమెరికా అభివృద్ధికే ఉపయోగపడాలని అన్నారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2025, జనవరి 20 అధికార మార్పిడి జరుగనుంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే అధికారం చేపట్టిన 24 గంటల్లో ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య 800 మైళ్లు బఫర్‌ జోన్‌ను అమలు చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్‌కు రష్యా మద్దతు..
ట్రంప్‌ ఆదేశాలకు రష్యా మద్దతు ఇచ్చింది. దీంతో రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా ట్రంప్‌ కూడా ఉక్రెయిన్‌ నాటోలో చేరకుండా సుదీర్ఘకాలం దూరంగా ఉండేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా తెలుస్తోంది. బైడెన్‌ అమెరికా సొమ్మును, ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపడాన్ని తప్పు పట్టిన ట్రంప్‌.. ఇప్పుడు అదే నిర్ణయాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

ట్రంప్‌పై జెలెన్‌స్కీ ప్రశంసలు..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసించారు. ట్రంప్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఇద్దరూ మాట్లాడుకుఆన్నరు. అమెరికా–ఉక్రెయిన్‌ సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించారు. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి న్యాయమైన శాంతికి చాలా అవసరమని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.