Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది కావస్తోంది. ఇప్పటికే ఆయనపై అగ్రరాజ్యంలో వ్యతిరేకత నెలకొంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చాలా మంది వ్యతిరేకించారు. ఇక న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఓటర్లు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో 2026 నవంబర్‌లో అమెరికాలో జరుగనున్న మిడ్‌టర్మ్ ఎన్నికలు ట్రంప్‌కు కీలకం. హౌస్, సెనెట్ నియంత్రణతోపాటు, మూడోసారి పోటీకి లైన్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో 79 ఏళ్ల ట్రంప్ 2026 నుంచే ఆందోళన చెందుతున్నారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యం..
వాషింగ్టన్‌లోని కెనెడీ సెంటర్‌లో జరిగిన హౌస్ రిట్రీట్‌లో ట్రంప్ సహచరులను హెచ్చరించారు. ‘ఎన్నికల్లో గెలవకపోతే ఇంపీచ్‌మెంట్ జరుగుతుంది‘ అని చెప్పారు. స్పీచ్‌లు, ఫండ్‌రైజింగ్‌ల ద్వారా అధికారం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఫండ్‌రైజింగ్ మెయిల్ వైరల్..
డెమోక్రట్ ఇన్‌ఫ్లూయెన్సర్ హ్యారీ సిస్సన్(24) ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రంప్ మెయిల్‌ను షేర్ చేశారు. ’అంధకారంలో ఒంటరిని’ అనే టైటిల్‌తో సపోర్టర్లకు పంపిన ఈ మెయిల్ ఫోటోతో మొదలవుతుంది. ‘వార్ రూమ్‌లో ఒంటరిగా, డెడ్ ల్యాప్‌టాప్‌తో, 72 గంటల డెడ్‌లైన్ టిక్ చేస్తోంది‘ అంటూ వర్ణించారు. రాడికల్ లెఫ్ట్ బోర్డర్లు తెరుస్తారు, గన్స్ పట్టుకుంటారు, పిల్లలను బ్రెయిన్‌వాష్ చేస్తారని హెచ్చరించారు. ‘మీ అధ్యక్షుడు (నేను!) మరో తప్పుడు ఇంపీచ్‌మెంట్‌కు గురవుతారు‘ అని హెచ్చరించి, ప్రతి ’రెడ్–బ్లడెడ్ అమెరికన్’ నుంచి 47 డాలర్ల డొనేషన్ కోరారు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
సిస్సన్ వీడియోలో ‘ఈ మెయిల్ పిచ్చి, క్రేజీ‘ అని పేర్కొన్నారు. ‘కోట్లు దొంగిలించి డొనేషన్ కోరుతున్నాడు‘, ‘బిలియన్లు ఉన్నా పేదల డబ్బు కావాలా?‘, ‘హోమ్‌లెస్ బెగ్గర్‌కి ఇలా చేస్తారా?‘ అంటూ ట్రోల్ చేశారు. రాజకీయ మెయిల్‌లు విచిత్రంగా ఉంటాయి కానీ ఇది అతి అతిగా అని వ్యాఖ్యానించారు.
Trump sent this creepy email to his supporters last night saying he’s “alone and in the dark” and he’s writing the message from a “dying laptop.” The only way to help him is to donate your money to him. Disgusting grift. Very weird! pic.twitter.com/mI6Z4k5iMz
— Harry Sisson (@harryjsisson) January 13, 2026