Donald Trump : అమెరికా ఈ తీరుగా ప్రపంచ దేశాలపై పెత్తనం సాగించడానికి ప్రధాన కారణం ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. బైడన్ అగ్ర రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు.. ప్రపంచ దేశాలు అమెరికాను సవాల్ చేశాయని.. శ్వేత సౌధం ఉన్న దేశం అత్యంత శక్తివంతమైన దేశమని.. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకునే సామర్థ్యం అగ్ర రాజ్యానికి ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.. అగ్రరాజ్య యువతను ఆకట్టుకోవడంలో ట్రంప్ విజయవంతమయ్యారు.. ట్రంప్ ప్రసంగాలు ఆ దేశస్థులను ఆలోచనలో పడేశాయి
అందువల్లేవారు ట్రంప్ ను తమ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిపించారు.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్ చిత్రవిచిత్రమైన విధానాలతో ప్రపంచ దేశాలనే కాదు.. చివరికి అమెరికా దేశస్థులను సైతం ఇబ్బందికి గురి చేస్తున్నారు. దీంతో అసలు ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎందుకున్నామని.. అమెరికా దేశస్తులు తలలు పట్టుకుంటున్నారు. చివరికి ట్రంప్ దిగిపోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అగరాజ్యం చరిత్రలో ప్రెసిడెంట్ గా ఎన్నికై ఆరు నెలలు కూడా పూర్తికాకముందే.. ప్రజల నుంచి ఇలాంటి నిరసనలు ఎదుర్కోన్న వ్యక్తి ట్రంపే కావచ్చు.
Also Read :చైనా రహస్యాల కోసం అమెరికా పెద్ద స్కెచ్*
అధ్యక్షుడిగా దిగిపోతున్నాడా..
అమెరికానే కాదు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ దిగిపోతున్నారా.. త్వరలో ఆయన వేరే మార్గం చూసుకోబోతున్నారా.. అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు ట్రంప్. కాకపోతే అవన్నీ వాస్తవరూపం దాల్చే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠం కంటే శక్తివంతమైన స్థానం ప్రపంచంలో మరొకటి ఉండదు. అలాంటి స్థానాన్ని వదులుకోవడానికి ట్రంప్ ఏమి పిచ్చోడు కాదు. కాకపోతే జనాలను పిచ్చోళ్లను చేయడానికి ట్రంప్ అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే అమెరికా చిత్రపటల్లో కెనడాను జతచేస్తూ ఓహ్ కెనడా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. దాన్ని మర్చిపోకముందే ట్రంప్ ఇప్పుడు మరో వివాదానికి తెర లేపాడు. తాను వాటికన్ సిటీకి పోప్ గా ఉన్నట్టు కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఫోటోలు.. ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఇటీవల కాలంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ట్రంప్.. తాను వాటికన్ సిటీకి పోప్ కావాలి అనుకున్నట్టు వెల్లడించాడు. అయితే ఇప్పుడు అదే ఫోటోను ట్రంప్ షేర్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. పరవైపు కొంతమంది మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో ఉండి ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష స్థానానికి ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.