https://oktelugu.com/

Putin Car: పుతిన్‌ కారు పేలుడు.. జెలన్‌స్కీ జోష్యం నిజం కాబోతోందా..!

Putin Car రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆగాలంటే.. పుతిన్‌ మరణించాలి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఇటీవల ప్రకటించారు. త్వరలోనే పుతిన్‌ మరణిస్తాడని కూడా తెలిపాడు.

Written By: , Updated On : March 30, 2025 / 01:24 PM IST
Putin Car

Putin Car

Follow us on

Putin Car: ఉక్రెయిన్‌–రష్యా మధ్య మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్దం(War) ఆపేందుకు అమెరికా, భారత్‌తోపాటు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవేవీ ఫలించలేదు. దీంతో చివరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలన్‌స్కీ(Jelansky).. పుతిన్‌ త్వరలో చనిపోతాడని, ఆ తర్వాతే యుద్ధం ఆగుతుందని ప్రకటించారు. ఆయన జోష్యం చెప్పిన నాలుగు రోజులకే పుతిన్‌ కారులో భారీ పేలుడు సంభవించింది.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆగాలంటే.. పుతిన్‌ మరణించాలి అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ ఇటీవల ప్రకటించారు. త్వరలోనే పుతిన్‌ మరణిస్తాడని కూడా తెలిపాడు. ఆయన ప్రకటించిన నాలుగు రోజులకే మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చెందిన అత్యంత లగ్జరీ లిమోజైన్‌ కారులో భారీ పేలుడు సంభవించింది. ఎఫ్‌ఎస్‌బీ(FSB)ప్రధాన కార్యాలయం సమీపంలోని లుబియాంకా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పుతిన్‌(Puthin) భద్రతపై సీరియస్‌ ప్రశ్నలను లేవనెత్తింది. ‘ది సన్‌’ నివేదిక ప్రకారం, ఈ ఖరీదైన కారు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగడం ప్రారంభమై, వెంటనే వాహనమంతా వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, కారు నుంచి దట్టమైన నల్లటి పొగ రాగా, వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. సమీపంలోని రెస్టారెంట్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

కారణాలు తెలియక..
ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ‘ది సన్‌’(The Sun) పేర్కొంది. ఈ కారు ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పర్యవేక్షణలో ఉంటుంది, ఇది పుతిన్‌ అధికారిక వాహన బందంలో భాగమని సూచిస్తుంది. ఈ ఘటన వీడియో ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ, ప్రపంచ నాయకులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ సంఘటనకు ముందు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్సీ్క యూరోవిజన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని వ్యాఖ్యానించారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ముగియడానికి కూడా ఇది దారితీస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కారు పేలుడు జరగడం ఊహాగానాలకు తావిచ్చింది. కైవ్‌ ఇండిపెండెంట్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, జెలెన్సీ్క ఈ విషయాన్ని బుధవారం జరిగిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

పుతిన్‌ భద్రతపై ఆందోళన..
రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణ తీవ్రంగా కొనసాగుతున్న వేళ, పుతిన్‌ భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ ఘటన పుతిన్‌పై హత్యాయత్నం కావచ్చనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రష్యా అధికారులు ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మాస్కోలో ఉద్రిక్తత నెలకొంది.