Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు గడువు తక్కువగా ఉండడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచారు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఒక అడుగు ముందుకేసి తనను గెలిపిస్తే ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తానని తెలిపారు. ఇక ప్రచారం జోరుగా సాగుతుండగా, ప్రీపోల్ సర్వేలు కూడా జోరందుకున్నాయి. సర్వే ఫలితాల్లో ప్రధాన పోటీ అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్యనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం జోరు పెంచారు. ఇక అమెరికాలోని వివిధ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారు కూడా ఇప్పటికే తమ మద్దతు ఎవరికో డిసైడ్ అయ్యార్థు. భారతీయులు ఎక్కువగా కమలా వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు కుబేరుడు ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ట్రంప్‌నకు మద్దతు తెలిపారు.
భారత్‌ను ఇష్టపడుతున్న ట్రంప్..
ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్‌ను ఇష్టపడుతున్నారు. భారతీయ హిందువులను అభిమానిస్తున్నారు. భారత్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నారు. భారతీయులు మాత్రం.. అమెరికా మాజీ అధ్యక్షుడిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. భారతీయ హిందువులు కూడా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో జరిగే ఎన్నికల్లో మెజారిటీ భారత అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కే మద్దతు ఇస్తున్నట్లు పలు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి.
మత ఉగ్రవాదంపై పోరాటం..
ట్రంప్ భారత్ మత ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటాన్ని ఇష్టపడుతున్నారు. తాను కూడా మతపరమైన ఉగ్రవాదానికి వ్యతిరేకమని గతంలో అనేకసార్లు ప్రకటించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక మతపరమైన ఉగ్రవాద సంస్థలను అణచివేశారు. భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. తాజాగా ఎన్నికల వేళ మరోమారు ట్రంప్ భారత్‌తో స్నేహం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. మతపరమైన ఉగ్రవాదానికి తాను వ్యతిరేకం అని ప్రకటించారు. తద్వారా భారత అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ట్రంప్ ప్రయత్నాలు భారతీయ అమెరికన్ల మద్దతు ఏమేరకు సంపాదిస్తుందో చూడాలి.