Donald Trump And Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Indian prime minister Narendra Modi) అమెరికా పర్యటన (America tour) లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో భేటీ అయ్యారు.. ఫ్రాన్స్ పర్యటన నుంచి నరేంద్ర మోడీ నేరుగా అమెరికా వెళ్లిపోయారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. నరేంద్ర మోడీ శ్వేత దేశం వెళ్లడం ఇదే తొలిసారి.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం శుక్రవారం ఉదయం నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను కలిశారు. అనంతరం ట్రంప్, మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఒక కీలకమైన ప్రతిపాదనను నరేంద్ర మోడీ ట్రంప్ దృష్టికి తీసుకురాగా.. ఆయన వెంటనే ఓకే చెప్పారు. 2008లో ముంబైలో ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించిన తహవూరు రాణా(Tahavur Rana) ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. ఫలితంగా రాణా భారతదేశంలో న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను ప్రతిపాదన పెట్టడం.. దానిని ట్రంప్ ఒప్పుకోవడంతో.. నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాణా ను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గత ఏడాది జనవరి 25న అంగీకారం తెలిపింది. అయితే ఉగ్రవాద ఘటనలో తనను దోషిగా ప్రకటించడం పూర్తిగా అవాస్తవమని రాణా అమెరికా కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ పిటిషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించింది. 2009లో FBI రాణా ను అరెస్టు చేసింది. రాణా పాకిస్తాన్ దేశస్థుడు అయినప్పటికీ.. కెనడాలో స్థిరపడ్డాడు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అతడు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. రాణా నాటి ముంబై దాడుల్లో కీలక సూత్రధారి డేవిడ్ కోల్మన్ హెడ్లి కు సహాయం చేశాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI), లష్కరే – ఈ – తోయిబా (LeT) లో కీలక సభ్యుడిగా ఉన్నాడు..రాణా ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లోని ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
భద్రతా సలహాదారుడి ని కూడా కలిశారు
అమెరికా పర్యటనలో నరేంద్ర మోడీ మరో కీలక సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా భద్రత సలహాదారుడు మైకేల్ వాల్ట్ జ్ ను కూడా కలిశారు. సమావేశం అనంతరం సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు.. అమెరికా జాతీయ భద్రత సలహాదారుడు వాల్ట్ జ్ తో జరిగిన సమావేశం అనుకూలంగా ఉందని.. ఆయన భారతదేశానికి అనుకూలంగా ఉంటాడని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.. నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్న వివరాల ప్రకారం..” భారత్ – అమెరికా సంబంధాలలో కీలక ముందడుగు పడింది. రక్షణ, సాంకేతికత, భద్రత అంశాలలో మెరుగైన ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు దేశాలు పనిచేస్తున్నాయి. అందువల్లే పది రకాల ఒప్పందాలు జరిగాయి. కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, అంతరిక్ష రంగాలలో కలిసి పని చేస్తామని” నరేంద్ర మోడీ అభిప్రాయ పడ్డారు. ఆ తర్వాత అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ను నరేంద్ర మోడీ బ్లెయిర్ హౌస్ లో కలిశారు. అనంతరం ట్విట్టర్ ఎక్స్ లో గబ్బర్డ్ ను నరేంద్ర మోడీ అభినందించారు.
President Donald J. Trump and Indian Prime Minister @NarendraModi pic.twitter.com/5w7n5uRdmL
— President Donald J. Trump (@POTUS) February 13, 2025