Fertility : తల్లి కావాలనేది ప్రతీ మహిళ జీవితకాల స్వప్నం. అయితే.. పలు కారణాలతో కొందరికి ఆ భాగ్యం కలగదు. దీంతో.. వైద్య రంగా ఉన్న అవకాశాల ద్వారా పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తారు. అందులో ఒకటే ఫెర్టిలిటీ. అంటే.. భర్తలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం లేదా మరేదైనా లోపం గుర్తించినప్పుడు.. ఇతరుల వీర్యంతో మహిళ గర్భం దాల్చేలా చేసే ప్రక్రియ. భారత్ వంటి సంప్రదాయ దేశాల్లో.. చాలా మంది ఈ పద్ధతిని అంగీకరించరు. జన్మించిన బిడ్డను ఎవరికో పుట్టిన బిడ్డగా చెప్పుకోవాల్సి వస్తుందన్న భావనలో ఉంటారు. కొందరు మాత్రం ఈ విధానంలో పిల్లలు కనడానికి అంగీకరిస్తారు.
అమెరికా(America)లో ఇదే పద్ధతిలో ఓ మహిళ గర్భం దాల్చేందుకు సిద్ధమైంది. అయితే.. ఎవరి వీర్యం ద్వారా తాను తల్లి కావాలనుకునేది సదరు మహిళ ఇష్టమే. కాబట్టి.. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న దాతల నుంచి వీర్యం సేకరిస్తారు. వైద్యుడి పని ఆ వీర్యం ద్వారా ఆమెకు గర్భం వచ్చేలా చూడడమే. అయితే.. న్యూయార్క్(New York) లోని ఓ వైద్యుడు చేసిన నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాతలు ఇచ్చిన వీర్యం కాకుండా.. తన సొంత వీర్యంతో చాలా మందికి గర్భం వచ్చేలా చేయడం సంచలనం రేకెత్తించింది.
1980వ దశకంలో ఆ వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళకు.. తన వీర్యంతో గర్భం దాల్చేలా చేశాడు. ఆ డాక్టర్ పేరు మోరిస్ వోర్ట్ మన్. ఈ విషయం ఇప్పుడెలా బయటకు వచ్చిందంటే.. డాక్టర్ వీర్యంతో గర్భవతి అయిన మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఇప్పుడు 40 ఏళ్లకు దగ్గర ఉంది. దీంతో.. ఓ గైనకాలజీ సమస్యతో ఇదే ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఈ విషయాన్ని బయటకు లాగింది.
ఆసుపత్రి ఈ మహిళ డీఎన్ఏ (DNA) టెస్టు చేయించుకుంది. డీఎన్ ఏలోని జీనాలజీ పరీక్ష చేయించుకుంటే.. తనకు తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నట్టుగా తేలిందట! అంటే.. ఆ డాక్టర్ మరికొంత మందికి కూడా తన వీర్యంతోనే గర్భవం వచ్చేలా చేశాడని ఆ మహిళ ఆరోపించారు. ఈ మేరకు కోర్టులో కేసు కూడా వేసింది. విచారణ కొనసాగుతోంది. అయితే.. సదరు వైద్యుడు మాత్రం ఈ విషయమై ఇంత వరకూ స్పందించలేదు.
ఇలాంటి కేసులో తరచూ బయట పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ.. కొందరు వైద్యులు తమ తీరు మార్చుకోవట్లేదు. నెవాడాలో వెలుగు చూసిన ఇలాంటి కేసులో నేరం నిరూపణ కావడంతో.. వైద్యుడి లైసెన్సును కోర్టు ఏడాదిపాటు రద్దు చేసింది. ఇలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.