న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పేరుతో ఎల్‌ఐసీ ఈ పాలసీని అందిస్తుండటం గమనార్హం. పిల్లల వయస్సును బట్టి పాలసీ టర్మ్ మారే అవకాశాలు అయితే ఉంటాయి. సాధారణంగా పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు కాగా సంవత్సరం వయస్సు ఉన్న పిల్లల పేర్లపై కూడా ఈ పాలసీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల పేర్లపై పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు అవుతోంది.
పిల్లల పుట్టిన సంవత్సరానికే పాలసీని తీసుకుంటే పాలసీ టర్మ్ 24 సంవత్సరాలు కాగా రోజుకు 125 రూపాయల చొప్పున నెలకు 3700 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత రూ.2 లక్షలు, 20 సంవత్సరాల వయస్సులో 2 లక్షలు, 22 సంవత్సరాల వయస్సులో 2 లక్షలు, 25 సంవత్సరాల తర్వాత 19 లక్షల రూపాయలు లభిస్తాయి. కేవలం 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఈ పాలసీని తీసుకోవచ్చు.
సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పిల్లల పేర్లపై పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు.