Island Countries: అత్యధిక ద్వీపాలను కలిగి ఉన్న దేశాలు ఏంటో తెలుసా?

మొత్తంగా నార్వేలో 2,39,057 దీవులు ఉన్నాయి, ఇందులో 60,000 మంది నివసిస్తున్నారు. ఇతర ప్రధాన ద్వీపాలు గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్‌లోని ఫిన్లాండ్ ప్రాపర్, బాల్టిక్ సముద్రంలోని ఆలాండ్ దీవులు అని సమాచారం.

Written By: Swathi Chilukuri, Updated On : May 24, 2024 1:05 pm

Island Countries

Follow us on

Island Countries: ద్వీపం, ద్వీపకల్పం అంటే తెలిసిందే. అందులో మన ప్రపంచంలో మొత్తం 9 లక్షల ద్వీపాలు ఉంటే మనదేశంలోనే మొత్తం 1,382 ద్వీపాలు ఉన్నాయి.ఇక ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు ఉన్న దేశం స్వీడన్. ఇందులో 2,67,570 ద్వీపాలను ఉన్నాయి. స్వీడన్ ఒక అద్భుతమైన, అందమైన దేశం. ఇందులో ఉత్తర ధ్రువానికి సమీపంలో 2,67,570 ద్వీపసమూహాలు ఉన్నాయట. వాటిలో 96,000 వాటికి మాత్రమే పేరు పెట్టారు. అయితే 80,000 మంది మాత్రమే ఈ ద్వీపాలలో నివసిస్తున్నారు.

ఇదిలా ఉంటే స్వీడన్ లో అతిపెద్ద ద్వీపం బాల్టిక్ సముద్రంలో ఉన్న గోట్లాండ్ ఐలాండ్ . ఇతర ప్రధాన ద్వీపాలు వంతెనల ద్వారా స్వీడన్‌కు అనుసంధానించబడి ఉన్నాయి ఇవి. ఇక జాబితాలోని తదుపరి దేశం ఆర్కిటిక్‌లోని హిమానీనదాలు, పర్వతాల నుంచి సమశీతోష్ణ ప్రాంతాల అడవులు, సరస్సుల వరకు వివిధ రకాల ప్రకృతి దృశ్యాలకు నిలయంగా ఉంది ఈ దేశం. ఈ ద్వీపాలు నార్వేజియన్ ధ్రువ ఎలుగుబంట్లు, వాల్‌రస్‌లు, రెయిన్‌డీర్‌లతో సహా అనేక రకాల వన్యప్రాణులకు నివాసం కల్పిస్తుంది.

మొత్తంగా నార్వేలో 2,39,057 దీవులు ఉన్నాయి, ఇందులో 60,000 మంది నివసిస్తున్నారు. ఇతర ప్రధాన ద్వీపాలు గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్‌లోని ఫిన్లాండ్ ప్రాపర్, బాల్టిక్ సముద్రంలోని ఆలాండ్ దీవులు అని సమాచారం. మరో వైపు కెనడా ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి అని తెలిసిందే. కెనడాలో 50,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్నాయట. వాటిలో కేవలం 52 మాత్రమే నివాసం ఉంటున్నారు. స్కాండినేవియన్ దేశాలలో ఒకటైన ఫిన్లాండ్‌లో మొత్తం 1,70,000 ద్వీపాలు ఉన్నాయి అని సమాచారం. వీటిలో 80,000 మంది నివసిస్తున్నారట. మరో వైపు ఆలాండ్ ఫిన్లాండ్‌లోని అతిపెద్ద ద్వీపంగా పేరు గాంచింది.

అగ్ర రాజ్యం అమెరికాలో మొత్తం 18,000 ద్వీపాలు ఉండగా, అందులో కేవలం 50 ద్వీపాలు మాత్రమే జనాభా ఉన్నారు. ఇక పసిఫిక్ మహాసముద్రంలో అతిపెద్ద ద్వీపం హవాయి. ఇదెలా ఉంటే దక్షిణాసియా దేశమైన ఇండోనేషియాలో మొత్తం 17,508 దీవులు ఉన్నాయి.