https://oktelugu.com/

Car That gives 360 Kilometers: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 360 కిలోమీటర్లు ఇచ్చే ఈ కారు గురించి తెలుసా?

ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. కొన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ వీటి ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఓ కారు మార్కెట్లో వాహనదారులను ఆకర్సిస్తోంది.

Written By: Srinivas, Updated On : November 18, 2024 2:54 pm
Hyundai Insert EV

Hyundai Insert EV

Follow us on

Car That gives 360 Kilometers: ఆటోమోబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. కొన్ని కంపెనీలు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువ వీటి ఉత్పత్తిపైనే ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఓ కారు మార్కెట్లో వాహనదారులను ఆకర్సిస్తోంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేరస్తే 360 కిలోమీట్ల మైలేజ్ ఇస్తోంది. ఇప్పటికే ఈ కారు కంటే ముందు ఎన్నో వచ్చినా.. ఇది డిజైన్ తో పాటు వివిధ రకాల ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో దీనిని కొనగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఇంతకీ ఈ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Hyundaiకంపెనీ భారత్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మోడళ్లు ఆకర్షించాయి. అయితే ఎలక్ట్రిక్ వేరియంట్ లో మొదటిసారి ‘కోనా’EV ని ప్రవేశ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ కొన్ని కారణాల వల్ల దీనిని నిలిపివేసింది. ఇప్పుడు కొత్తగా హ్యుందాయ్ నుంచి Insert EV ఆకర్షిస్తోంది. ఎలక్ట్రిక్ వేరియంట్ లో అతి చిన్న కారుగా ప్రత్యేకత సాధించుకున్న ఈ కారు ఎలా ఉందో చూద్దాం..

హ్యుందాయ్ Insert EV అందరికీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు దీనిపై డ్రైవింగ్ చూస్తూ కొత్త అనుభూతి పొందుతారు. ఈ కారుకు 17 అంగుళాల మెషిన్డ్ అల్లాయ్ వీల్స్,రూప్ రాక్, ఐచ్చిక రూప్ స్టోరేజ్ కంపోర్ట్ ఉన్నాయి. దీనికి గ్రీన్ మ్యాన్ ప్రత్యేక మైన ఎక్సీటీరియర్ ను అమర్చారు. ఇది గ్రీన్ కలిగిన ఫ్యాబ్రిక్ గ్రే కలర్లో అందుబాటులో ఉంది. ఇన్నర్ ఫీచర్లలోకివెళ్తే.. ఫ్రీస్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆడాస్ ఫీచర్లను కలిగి ఉంది.

Insert EVలో 49 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీనికి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 360 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 30 నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. 100 శాతం ఛార్జింగ్ పూర్తి కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీలపై 115 బీహెచ్ పీ పవర్, 147 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నలుగురు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించే ఇందులో 280 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంది. వెనక సీట్లు వెనక్కి నెట్టినప్పటికీ స్పేస్ అధికంగానే ఉంటుంది. Insert EVని రూ.12 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో భారీ విండో స్క్రీన్ ఉండడంతో సిటీల్లో ప్రయాణించేవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే పెడల్ చాలా సున్నితంగా ఉండడంతో బ్రేకులు అనుకున్నంత స్పీడ్ గా పడవు.

ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ స్పేస్ ఎక్కువగా ఉండడంతో ఎస్ యూవీ కార్లతో పోటీ పడుతుంది. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. రాడార్ డైడెడ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ కెమెరా, డ్రైవర్ అటెన్షన్ మానిటర్, లేన్ కీపింగ్ స్టీరింగ్ వంటివి సేప్టీని ఇస్తాయి.