Diwali Edmonton Incident: దీపావళి.. భారత దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటి. చెడుపై మంచి సాధించిన విజాయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ధనిక, పేద తేడా లేకుండా తమ ముంగిళ్లలో దీపాలు వెళిగించి పండుగ చేసుకుంటారు. ఇక సంపన్నులు అయితే ధనలక్ష్మీ పూజ చేస్తారు. ఇక దీపావళి రోజు టపాసులు కాల్చడం ఆనవాయితీ. అయితే దీపావళిని దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించడం, లక్ష్మీపూజ, టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ ఏడాది కెనడాలోని ఎడ్మంటన్‌లో జరుపుకున్న దీపావళి స్థానికుడికి విషాదం మిగిల్చింది. పొరుగువారి ఫైర్‌వర్క్స్ కారణంగా ఓ కుటుంబ ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటన దీపావళి రాత్రి భయంకరంగా మారడానికి కారణమైంది.
సాంస్కృతిక స్వేచ్ఛ పేరిట నిబంధనలు గాలికి..
విదేశాల్లో స్వేచ్ఛ జీవనం సాగించేవారు అక్కడి నిబంధనలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడం తప్పనిసరి. లేదంటే అక్కడ జీవనం కష్టతరం అవుతుంది. దీపావళి రోజు బాణాసంచ కాల్చడం మన సంస్కృతిలో భాగమే. కానీ విదేశాల్లో వీటిపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఎడ్మంటన్ ఘటనలో, రాత్రి సమయంలో అనధికారికంగా కాల్చిన టపాసుల కారణంగా పేలుడు సామగ్రి ఇంటి గొట్టం, గ్యారేజ్‌ను దహించివేసింది. చాలా మంది భారతీయులు స్థానిక అధికారుల సలహాలను అవగతం చేసుకోకుండా, టపాసులు కాల్చారు. ఇది స్థానికులను గాయపర్చడమే కాకుండా, ఇళ్లను దహించివేయడం విషదకరం. ఇలాంటి ఘటనలు చట్టపరమైన జరిమానాలు, విదేశీ వీసా సమస్యలకు దారితీస్తుంది.
జాగ్రత్తలు, నిబంధనలు పాటించాల్సిందే.
తాజాగా ఎడ్మంటన్‌లో జరిగిన ఘటన విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఒక పాఠం. చాలా దేశాల్లో ఫైర్‌వర్క్స్‌లకు అనుమతి అవసరం. రాత్రి 10 గంటల తర్వాత కాల్చడం నిషేధం. ఇది తెలుసుకోవాలి. లేజర్ లైటింగ్ లేదా వర్చువల్ డిస్‌ప్లేలు వంటి సురక్షిత పద్ధతులు ఉపయోగించాలి. భారతీయ సంఘాలు వర్క్‌షాప్‌లు నిర్వహించి, పొరుగువారితో సంభాషణలు పెంచాలి. ఇటీవలి క్వీన్స్, న్యూయార్క్ ఘటనల్లాగా, ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి, కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి.
సమతుల్యతతో సంప్రదాయాలు కాపాడుకోవాలి. మన సంస్కృతికి కాపాడడం, భావితరాలకు అందించడం మంచిదే. కానీ అనువుకాని చోట అధికులం అనరాదు. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియని దేశాల్లో వేడుకలు జరుపుకుంటామంటే.. మన ఆనందం ఇంకొకరికి బాధ కలిగిస్తుంది. ప్రమాదకరంగా మారుతుంది. చివరకు విషాదానికి దారితీస్తుంది. తద్వారా విదేశాల్లో ఉండే హక్కునే కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ ఎడ్మంటన్ దుర్ఘటన ఒక హెచ్చరిక. ఉత్సాహం ప్రమాదాలకు దారితీయకుండా చూసుకోవాలి. స్వేదేశ ఆచారాలను గౌరవిస్తూ, స్థానిక వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం మాత్రమే భవిష్యత్ తరాలకు సురక్షితమైన వారసత్వాన్ని అందిస్తుంది.
Your #Diwali celebration? My house is gone!
What a sad incident, disappointing beyond words.
Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV
— M9 USA (@M9USA_) October 24, 2025