Dinga Dinga disease : ఉగాండాలో డింగా డింగా విజృంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల్లో ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఒక వింత వ్యాధి విస్తరిస్తోంది. ఈ వ్యాధి గురించి మీరు ఇంతకు ముందెన్నడూ విని ఉండరు. అయితే ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉంటుందో ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి ఈ రోజుల్లో ఆందోళన కలిగించేదిగా మారింది. అయితే ఈ ‘డింగా డింగా’ అంటే ‘కదులుతూ నృత్యం చేయడం అని మీనింగ్ అంట.
ఇది ఒక రహస్య వ్యాధి. దీనిని స్థానికంగా డింగా డింగా అని పిలుస్తారు. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఇది అక్కడి స్థానికులలో భయాందోళనలను కలిగిస్తుంది. ఇది ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. కానీ వేగంగా విస్తరిస్తుంది. ఆఫ్రికన్ దేశంలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఆరోగ్య అధికారులు ఈ వ్యాధి రావడానికి గల కారణాలను గుర్తించడానికి కష్టపడుతున్నారని స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే పూర్తిగా ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం.
యుగాండాలో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి గురించి ఇంకా చాలా సమాచారం వెల్లడి కాలేదు. అయినప్పటికీ ఇది టీనేజ్ బాలికలు, మహిళల్లో వేగంగా ప్రభావితం చేస్తుంది. దీని వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. ఈ వ్యాధి కారణంగా, శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యక్తి నడవడానికి ఇబ్బంది పడతాడు. దూరం నుంచి చూస్తే, బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
డింగా డింగా లక్షణాలు:
ఈ వ్యాధి లక్షణాలు కూడా పూర్తిగా తెలియడం లేదట. అయితే కొన్ని సాధారణ లక్షణాలు ప్రజలలో కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి అధికంగా శరీరం కదులుతూ ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు జ్వరం, బలహీనత, కొన్ని సందర్భాల్లో పక్షవాతం వంటి సమస్యను ఎదుర్కొంటారు. ఈ వ్యాధి కారణంగా, ప్రజలు నడవడానికి ఇబ్బంది పడతారు. నడుస్తున్నప్పుడు శరీరం చాలా వణుకుతుంది. అనియంత్రిత వణుకు నడకను సవాలుగా మారుస్తుంది. బాధిత ప్రజలు నడవడం దాదాపు అసాధ్యంగా మారుతుందని స్థానిక మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారట. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు కాబట్టి పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారట.