Allu Arjun : నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటన లో రేవతి చనిపోవడం, శ్రీతేజ్ కోమాలో ఉండడం, అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం వంటి ఘటనలను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ పై డైరెక్ట్ ఎటాక్ చేస్తూ వేసిన కొన్ని ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ అవుతూ కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ మొన్న సంధ్య థియేటర్ లో జరిగింది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్. ఇందులో ఎవరి తప్పు లేదు, అందరూ తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసారు, ప్రభుత్వం, పోలీస్ అధికారులు కూడా మాకు సహకరించేందుకు ఎంతో కష్టపడ్డారు. కానీ దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. ఇప్పటి వరకు నేను ఆ ఘటన నుండి తేరుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ నా క్యారక్టర్ ని తప్పుపడుతూ ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేసారు. నేను నా అభిమానులను లెక్క చెయ్యలేదు , వాళ్లకి ఏమి జరిగినా పట్టించుకోలేదు అన్నారు. 20 ఏళ్ళ నుండి నేను ఇండస్ట్రీ లో ఉన్నాను. ఎప్పుడైనా ఇలా చేసానా?, ఎన్నో సార్లు నేను సంధ్య థియేటర్ కి వెళ్ళాను, నా సినిమాలకే కాదు, ఇతర హీరోల సినిమాలను కూడా అందులో చూసాను, ఎప్పుడైనా ఇలాంటి దుర్ఘటన జరిగిందా?, దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది, దానికి నన్ను తప్పుబడితే ఎలా?, పోలీస్ పర్మిషన్ లేకుండా నేను లోపలకు వెళ్ళాను అనడం లో ఎలాంటి నిజం లేదు. నేను లోపలకు వస్తుంటే వాళ్ళు వద్దు అని చెప్పుంటే వెనక్కి వెళ్లిపోయేవాడిని. వాళ్ళే లైన్ క్లియర్ చేస్తూ నన్ను లోపలకు పంపారు’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు పోలీసులు నా దగ్గరకి వచ్చి మాట్లాడినట్టు చెప్పారు. అందులో కూడా ఎలాంటి నిజం లేదు, నా దగ్గరకి ఎవ్వరూ రాలేదు. థియేటర్ స్టాఫ్ కి సంబంధించిన వాళ్ళు, పరిస్థితి కంట్రోల్ లో లేదు , మీరు వెళ్ళిపోవాలి అని చెప్తే నేను వెంటనే వెళ్ళిపోయాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, శ్రీతేజ్ వయస్సే మా అబ్బాయికి కూడా, నేనెందుకు వాళ్ళను పట్టించుకోకుండా ఉంటాను. నాకు శ్రీ తేజ్ ని కలిసేందుకు లీగల్ సమస్యల కారణంగా అనుమతి లేదు. అనుమతి ఇస్తే ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళిపోతా’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అల్లు అరవింద్, అల్లు అర్జున్ తరుపున న్యాయవాది కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అల్లు అరవింద్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారింది.