Vikramarkudu 2 Movie : రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అయిన తర్వాత మిగిలిన భాషలన్నింటిలో రీమేక్ అయింది. ప్రతి భాషలో కూడా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయన నటించిన హీరోలకు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ గా ‘విక్రమార్కుడు 2’ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఆలోచనలో అయితే ఉన్నారు. ఇక మొత్తానికైతే విజయేంద్రప్రసాద్ సైతం ఈ సినిమాకి సంబంధించిన కథను రెడీ చేసి పెట్టానని ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తారు అనే ధోరణి లోనే చాలా వరకు ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి ఇప్పుడు రాజమౌళి ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం అయితే లేదు. మరి ఈ సినిమాని ఎవరు డైరెక్షన్ చేస్తారు అనే ధోరణిలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైతం ‘విక్రమార్కుడు 2’ సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రవితేజ విక్రమార్కుడు సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మరి విక్రమార్కుడు 2 సినిమాని చిరంజీవితో చేస్తే ఎలా ఉంటుందనే సినిమా మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారట. మరి చిరంజీవి కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి రవితేజ క్యారెక్టర్ లో ఉన్న ఆ హై వోల్టేజ్ ఎనర్జీని చిరంజీవి తీసుకురాగలుగుతాడా? అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో రవితేజను తప్ప మనం వేరే వాళ్ళను ఊహించుకోలేము…అలాంటి క్యారెక్టర్ లో చిరంజీవి మెప్పించగలరు అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మొత్తానికైతే రవితేజ తో విక్రమార్కుడు 2 సినిమా వస్తుందా లేదంటే చిరంజీవి ఈ సినిమాని చేస్తాడా అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు ఇప్పుడు సీక్వెల్స్ సినిమాలను చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే చిరంజీవి విక్రమార్కుడు 2 సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…