https://oktelugu.com/

Abortion Pills: అమెరికాలో అబార్షన్‌ మాత్రలకు డిమాండ్‌.. ట్రంప్‌ గెలుపుతో మారిన పరిస్థితి!

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను అమెరికా మహిళలు వ్యతిరేకిస్తున్నారు. 4బీ ఉద్యమం ప్రారంభించారు. మరోవైపు అబార్షన్‌ పిల్స్‌ కొనుగోలు చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 12, 2024 5:44 pm
    Abortion Pills

    Abortion Pills

    Follow us on

    Abortion Pills: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో జనవరిలో అడుగు పెట్టనున్నారు. ఈమేరకు అధికార మార్పిడికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. మరోవైపు తన పాలకవర్గం ఎంపికలో ట్రంప్‌ బిజీగా ఉన్నారు. మంత్రి పదవులు, వైట్‌హౌస్‌ కార్యవర్గం కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపును మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. పురుషుల కారణంగానే ట్రంప్‌ గెలిచాడని, గెలిపించారని ఆరోపిస్తున్నారు. దీంతో పురుషులకు సహకరించొద్దని నిర్ణయించారు. ఈమేరకు 4బీ ఉద్యమం మొదలు పెట్టారు. రోజు రోజుకు ఈ ఉద్యమం ఉధృతమవుతోంది. మరోవైపు అమెరికాకు ట్రంప్‌ అధ్యక్షుడు కాబోతున్న నేపథలో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అబార్షన్‌ మాత్రలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ మాత్రలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఒక్క రోజులోనే వీటి కోసం 10 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయట. ఈమేరకు స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

    గర్భ విచ్ఛిత్తిపై నిషేధం..
    ట్రంప్‌ అధికారం చేపట్టాక గర్భ విచ్ఛిత్తి హక్కును నిషేధిస్తారని తెలుస్తోంది. ట్రంప్‌ గతంలో ప్రకటన కూడా చేశారు. గర్భ విచ్ఛితి తమ హక్కతి, తామే నిర్ణయం తీసుకుంటామని మహిళలు అంటున్నారు. కానీ, ట్రంప్‌ మాత్రం గర్భవిచ్ఛిత్తి నేరం అంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక అబార్షన్‌ మాత్రలు దొరకవని భావించి చాలా మంది ఇప్పుడే కొని పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ట్రంప్‌ గెలిచిన 24 గంటల నుంచే అబార్షన్‌ మాత్రలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారుల పేర్కొంటున్నారు. 24 గంటల్లోనే 10వేలకుపైగా రిక్వెస్ట్‌లు వచ్చాయని వెల్లడిసుత్నా ్నరు. గతంలో కంటే కొనుగోళ్లు 17 రెట్లు పెరిగాయని అంటున్నారు.

    గర్భిణి కానివారు కూడా..
    ప్రస్తుతం గర్భిణులు కానివారు కూడా ప్రిస్క్రిప్షన్‌ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్‌జీవో సంస్థ తెలిపింది. తమకు 125 అభ్యర్థనలు రాగా అందులో 22 మంది గర్భిణులు కాదని పేర్కొంటున్నారు. ఇక ఎన్నికల ముందు గర్భనిరోధక మాత్రలు ఎక్కడ దొరుకుతాయని నిత్యం 4 వేల నుంచి 4,500 మంది తమ వెబ్‌సైట్‌ చూసేవారని తెలిపింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఇలా సెర్చ్‌ చేసేవారి సంఖ్య భారీగా మార్పు వచ్చిందని మరో స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ప్రస్తుతం నిత్యం 82 వేల మందికిపైగా వెబ్‌సైట్‌లో గర్భ నిరోధక మాత్రల కోసం సెర్చ్‌ చేస్తున్నారని వెల్లడించింది. కొందరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిపింది.