Saudi Arabia Death Penalty: మన దేశంలో ఉరిశిక్ష రద్దు చేయబడింది. గతంలో ఉన్న ఈ శిక్షను వివిధ కారణాలతో రద్దు చేశారు. ప్రస్తుతం యావజ్జీవ శిక్ష మాత్రమే అమలవుతోంది. ఇక కొన్ని కేసుల్లో మాత్రం ఉరి విధిస్తున్నాయి న్యాయస్థానాలు. కానీ గల్ఫ్ దేశాల్లో కఠిన చట్టాలు ఉంటాయి. నేరం చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయడం, లేదా కాల్చి చంపడం వంటి శిక్షలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. సౌదీ అరేబియాలో అయితే మరణ శిక్షలు వేగంగా అమలు చేయబడుతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలలో ఉరిశిక్ష అమలు గరిష్ట స్థాయికి చేరింది. ఈమేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక వెల్లడించింది. మాదక ద్రవ్యాల కేసులు ఈ శిక్షలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఇది సౌదీ యువరాజు మాటలకు విరుద్ధంగా ఉందని ఆమ్నెస్టీ ఆరోపిస్తోంది.
Also Read: మిత్రులు శత్రువులుగా.. రాజకీయంగా ట్రంప్ ఎందుకు ‘ఒంటరి’గా మిగిలిపోతున్నాడు?
సౌదీలో పెరిగిన మరణ శిక్షలు..
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, 2024లో సౌదీ అరేబియాలో 345 మరణ శిక్షలు అమలయ్యాయి, ఇది గత మూడు దశాబ్దాలలో అత్యధికం. 2025 మొదటి ఆరు నెలల్లోనే 180 మందిని ఉరితీశారు. ఈ గణాంకాలు సౌదీ న్యాయ వ్యవస్థలో మరణ శిక్షల వినియోగం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తున్నాయి. ఈ శిక్షలలో ఎక్కువ భాగం మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించినవి. హత్యల కేసులకు మాత్రమే మరణ శిక్ష విధిస్తామని 2022లో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన ప్రకటనకు ఈ ధోరణి విరుద్ధంగా ఉంది.
సౌదీ ప్రకటనలకు భిన్నంగా..
సౌదీ అధికారులు మరణ శిక్షల వినియోగాన్ని తగ్గిస్తామని ప్రకటించినప్పటికీ, ఆమ్నెస్టీ నివేదిక దీనికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. ప్రాణాంతకం కాని నేరాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల కేసులకు కూడా ఉరిశిక్షలు విధించడం మానవ హక్కుల సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆమ్నెస్టీ ప్రకారం, ఈ శిక్షలు సౌదీ న్యాయ వ్యవస్థలో పారదర్శకత, న్యాయమైన విచారణల లోపాన్ని సూచిస్తాయి. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా, తీవ్రమైన నేరాలు కానివాటికి కూడా మరణ శిక్షలు విధించడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: చైనా టర్కీలకు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్
అంతర్జాతీయ ఆందోళన..
మరణ శిక్షల సంఖ్య పెరగడం అంతర్జాతీయ సమాజంలో విమర్శలకు దారితీసింది. సౌదీ అరేబియా తన న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించినప్పటికీ, మాదక ద్రవ్యాల కేసుల్లో ఉరిశిక్షలు కొనసాగడం ఈ సంస్కరణల పటిష్ఠతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సౌదీ అరేబియాను మరణ శిక్షల వినియోగాన్ని తగ్గించమని, ప్రాణాంతకం కాని నేరాలకు ఈ శిక్షలను నిలిపివేయమని కోరింది. అంతేకాక, న్యాయ విచారణలలో పారదర్శకతను పెంచాలని సూచించింది.